తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ముగిసింది. రెండుచోట్లా కొన్ని
చెదురు ముదురు సంఘటనలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రాలో కొన్ని చోట్ల TDP-YSRCP కార్యకర్తల మధ్య కొన్ని పోలింగ్ బూత్ లలో చిన్నపాటి ఘటనలు మినహా పోలింగ్ అంతటా సాఫీగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఓటర్లను లైనులో నుంచోవటానికి అధికారులు అనుమతించారు. ఆంధ్రాలో భారీ సంఖ్యలో ఓటర్లు లైన్లలో నుంచున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రాలో 68.04 శాతం, తెలంగాణలో 61.16 శాతం ఓటింగ్ జరిగింది. రాజకీయం వెల్లి విరిసే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వొచ్చినా కోలాహాలమే. ఈ సారి కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నాయి. అస్త్రాలు- ప్రతి అస్త్రాలతో అన్ని నియోజకవర్గాలలో యుద్ధ వాతావరణమే కొనసాగింది. డిల్లీ నుండి జాతీయ నాయకులు కూడా చురుకుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి కనపడుతోంది.