
హిందూ మతాన్ని అనుసరించేవారు వాస్తును అనుసరించే నిర్మాణాలు చేపడతారు, అయితే వాస్తు నిపుణులు చెప్పిన విధంగా కాకుండా ఏవైనా మార్పులు చేస్తే అవి విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయని అని కూడా నమ్ముతువుంటారు. అయితే ఈ వాస్తు దోషం ఒక్కొక్కరిపై ఒక్కో మాదిరిగా ప్రభావం చూపుతుంది. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ ఆ ధనం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోవడం మనం చూస్తూనే ఉంటాం. మరి కొందరు వారి పనుల కోసం డబ్బును సమకూర్చుకోవాలి అని చూసినప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ వాస్తు దోషాల వల్లనే ప్రభావాలే అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.