ఈ ఒక్క యాప్ ఆడ పిల్లలకే కాదు మహిళల అందరికి ఉపయోగం

hqdefault edited ఈ ఒక్క యాప్ ఆడ పిల్లలకే కాదు మహిళల అందరికి ఉపయోగం

ఈ రోజుల్లో ఆడ పిల్లలు దగ్గర నుంచి యువతులు అలాగే మహిళలు వీరు అందరు తమ తమ పనుల్ల మీద బయటకు వెళ్ళాల్సి ఉంటుది. ఆ సమయం లో వారి ధైర్యమే వారికి ఆయుధం. కొందరి కి ధైర్యం ఉంటుంది కొందరికి అయితే ధైర్యం అనే పదం కనిపించదు వారిలో. కొందరైతే ప్రయాణం చేయడానికే అనునిత్యం భయ పడుతుంటారు. అలాంటి వారికి ఎంతో ఉపయోగ పడేదే ఈ యాప్ ” నిషా గేమ్ “.

అంతే కాదు ఇది ఒక గేమ్ యాప్. ఇందులో చిన్న పిల్లల కు వారికి ఎదురయ్యే ఎటువంటి సమస్య అయిన అంటే వారికి ఆరోగ్య సమస్య వస్తే ఎలా స్పందించాలో ఆ గేమ్ ఆడడం వల్ల తెలుసుకోవచ్చు.

చిన్న పిల్లల కు ఎదురయ్యే పిరియడ్స్ సమస్యే కాకుండా ఇంకా వారికి వచ్చే ఇతర అనారోగ్య సమస్యలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో ఈ యాప్ డైరెక్ట్ చేస్తుంది. ఈ యాప్ చాలా క్రియేటివ్ గా తయారు చేసారు ఆ సంస్ద వారు. ఎంతో మంది చిన్నపిల్ల మీద యుక్త వయస్సులో యువతుల మీద, వయసు మీరిన స్త్రీల మీద ఎన్నో అంశాల మీద మాట్లాడి ఈ యాప్ ని అందుబాటు లోకి తెచ్చామని ఇది పూర్తి గా ఉచితమని దీనిని అందరు ఉచితం గా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు, అలాగే కొంత మంది ఆడ పిల్లలు కాని అమ్మాయిలూ కాని వారికి వచ్చిన సమస్యలు గురుంచి ఎవరిని సంప్రదించాలని అలాగే సలహాలు అడగాలని అనుకుంటారు.

ఇలాంటి వారికి ” నిషా గేమ్ ( Nisha Go – game aap) ” ఒక చక్కని పరిష్కారం చూపిస్తుందని వారు చెప్పారు. అంతే కాదు వారికి కావలసిని మానసిక ధైర్యాన్ని కూడా ఇది ఇస్తుందని వారు చెప్పారు. ఇది ఉపయోగించిన వారు వారి సమస్యలని అందులో ఎంట్రీ చేసిన వివరాల ఆధారం గా మహిళల సమస్యల పై పని చేసే హేల్పెజ్ లాంటి సంస్దలకు వీరి వీడియో లింక్ వారికి ఈ సంస్దలకు లింక్ రూపం లో అందిస్తుంది.

ఒక్క మాట లో చెప్పాలంటే ఇది అన్ని వయస్సు ల వారికి ఎంతో ఉపయోగపడే ధైర్యం లాంటి ఆయుధం లాంటిదని చెప్పవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితం గ లభిస్తుంది.

Leave a Comment