ఈ పధకాల లభ్దిదారుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఆంద్ర ప్రదేశ్ స్ధానం నెంబర్ 1 – NABDRD

nab ఈ పధకాల లభ్దిదారుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఆంద్ర ప్రదేశ్ స్ధానం నెంబర్ 1 - NABDRD

రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ల ద్వారా స్వల్పకాలిక రుణాల పొందడం లో దేశం లో ఆంద్ర ప్రదేశ్ స్దానం 5 లో ఉండగా, దక్షిణాది రాష్ట్రాలలో నెంబర్ 1 స్దానం లో ఉందని నాబార్డ్ బ్యాంకు తెలిపింది. వ్యవసాయ ఆంద్ర ప్రదేశ్ లో Y.C.P. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన, అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుండడం అంతే కాకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా పంటలు సాగు చేసుకోవడం బాగా కలిసివచ్చింది.

దీంతో K.C.P. ద్వార స్వల్పకాలిక రుణాల తీసుకోవడం కోసం రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. రుణాలు తీసుకోవడం లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్దానం లో ఉందని NABDRD తెలిపింది. తర్వాతి స్థానాలు వరుసగా ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్,మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రం లో మొత్తం 45.52 లక్షల మంది రైతులకు ఈ కార్డులు జారీ చేసారు అని S.L.B.C. తన నివేదిక లో ప్రకటించింది.

అంతే కాకుండా పశు సంవర్ధక తో పాటు మత్స్య కారుల, డెయిరీ నిర్వహణ రైతుల కార్య కలాపాలు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కొరకు K.C.P. లను సంత్రుప్త స్దాయిలో ఇవ్వాలని S.L.B.C. తెలిపింది. ఇటువంటి రైతులకు KCC ల మంజూరు మార్చి నెల ఆఖరి వరకు కాకుండా ప్రతీ శుక్రవారం కొన్ని ప్రత్యేక క్యాంపులు పెడుతున్నట్లు చెప్పింది.

ఈ క్యాంపులలో రైతుల వద్ద నుండి దరఖాస్తులను తీసుకుని అదే సమయం లో అన్ని వివరాలు పరిశీలించి అర్హులైన వారికి వెంటనే KCC ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు అన్ని శాఖల రైతుల నుండి 82,366 ధరఖాస్తులు రాగా అందులో 68,948 మంది రైతులకు KCC ని ఇచ్చామని అధికారులు చెప్పారు. ఇందులో మత్స్య కారులు కోసం 36,076 మంది నుండి దరఖాస్తులు వస్తే 22,856 మంది కి KCC ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రెజెంట్ ఆర్ధిక సంవత్సరం లో పశుసంవర్ధక వారికి 95,445 మంది ఖాతాలకు దాదాపు 1079.26 కోట్లు, మత్స్య రంగం వారికి 5,112 వారి ఖాతాలకు 285.95 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Leave a Comment