ఎన్నికల్లో పోటీ పై షర్మిల ఏమన్నారంటే..

ఎన్నికల్లో పోటీ పై షర్మిల ఏమన్నారంటే..

తెలంగాలో అధికార బీ.ఆర్.ఎస్ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతోంది, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా యేవో కొన్ని స్థానాలు మినహా దాదాపుగా అన్నింటా అభ్యర్థులను ప్రకటించేశాయి.

ఎక్కడికక్కడ ప్రచారాలు:

సభలతో ఓటర్లను ఆకర్షించుకునే పనిలో ఉన్నాయి. అయితే నిన్నమొన్నటివరకు వార్తల్లో వ్యక్తిగా ఉంటూ, తెలంగాణ మొత్తం చుట్టేసిన వై.ఎస్ షర్మిల కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయారు. చడీ చప్పుడు లేకుండా చాటుకు వెళ్లిపోయారు.

షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి.

ఏది ఏమైనా షర్మిల మరోమారు తెరమీదికి వచ్చారు. తెలంగాణ ఎన్నికలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని అంటున్నారు. అంతేకాదట రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ పై షర్మిల ఏమన్నారంటే..

స్టేట్ లో 50 సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మాటలు ఇలా ఉంచితే అసలు ఆమె పార్టీ నుండి పోటీ చేసేందుకు అబ్యర్ధులు ఉన్నారా ? అంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇంతవరకు అభ్యర్థుల లిస్టు బయటపెట్టని షర్మిల ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతారు అని బాహాటంగానే మాట్లాడుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ఇక ఆమె పాలేరు నుండే పోటీ చేస్తున్నట్టు మాత్రం అర్ధమవుతోంది.

ఇదే పాలేరులో కాంగ్రెస్ నుండి పొంగులేటి, అధికార బీ.ఆర్.ఎస్ నుండి కందాల పోటీ చేస్తున్నారు. కాబట్టి పాలేరులో పోటీ రసవత్తరంగా ఉండనుంది.

Leave a Comment