కొత్త పధకాలతో దూసుకుపోతున్న ఆంద్ర – Y.S.R. కళ్యాణమస్తు, షాదీతోఫా లకు నిధులు విడుదల

Jagan releases Kalyanamasthu Shaadi Tohfa funds 1200x800 1 కొత్త పధకాలతో దూసుకుపోతున్న ఆంద్ర - Y.S.R. కళ్యాణమస్తు, షాదీతోఫా లకు నిధులు విడుదల

నిరుపేద కుటుంబాలను ఆదుకునే క్రమం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు పధకాలకు నిధులు విడుదల చేసింది. అవి 1.Y.S.R. కళ్యాణమస్తు 2.షాదీతోఫా లకు నేరుగా వివాహం చేసుకున్న జంటల అకౌంట్ లోకి జమ చేసామని ప్రభుత్వం తెలిపింది.

2023 సంవత్సరం లో అక్టోబర్ – డిసెంబర్ లో వివాహం చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు Y.S.R. కళ్యాణమస్తు,షాదీతోఫా లకు ఈ పధకాల క్రింద 78.53 కోట్లను C.M జగన్ క్యాంప్ ఆఫీస్ నుండి బటన్ నొక్కి వధూవరుల తల్లుల ఖాతాలో జమ చేసారు.

సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవలసిన అవసరం లేకుండా నేరుగా గ్రామ సచివాలయం లోనే మారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేవిధం గా మార్పులు చేర్పులు చేసారు. ప్రతీ ఒక్కరికి ఈ పధకం అందుబాటు లోకి తీసుకొచ్చామని ఈ పధకాన్ని అందరు ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాం అని చెప్పారు

C.M జగన్ చ్కతుల మీదుగా ళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల…

నిరుపేద తల్లితండ్రులు తమ పిల్లలను బాగా చదివించి వారి వివాహం పద్ధతి గా గౌరవ ప్రదం గా జరిగేల వారికి అండగా ఉంటామని చెప్పారు. SC,ST,BC,మైనారిటీస్, ఫిజికల్ హాన్దికాప్, భవన నిర్మాణ కార్మికులకు వీరి కుటుంబం లో ఉన్న ఆడపిల్లలకు Y.S.R. కళ్యాణమస్తు ద్వార ఆర్ధిక సదుపాయం అందిస్తున్నారు. అలాగే మైనార్తి ఆడపిల్లలకు కూడా Y.S.R. షాదీ తోఫా పధకం ద్వార ఆర్దిక సాయం అందిస్తున్నామని చెప్పారు

Y.S.R. కళ్యాణమస్తు,Y.S.R. షాదీ తోఫా లలో వధువుకు 18 సంవత్సరాలు, వరుడి కు 21 సంవత్సరాలు వయస్సు ఉండే విధం చూసామని చెప్పారు. ఇంటర్ తర్వాత పెళ్లి చెయ్యకుండా ప్రభుత్వం ఇచ్చే జగనన్న విద్య దీవన, జగనన్న వసతి దీవన పధకాల ద్వార ఏటా 20,000 వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని చేప్పారు.

వారు కూడా డిగ్రీ లో చేరి అది పూర్తి చేస్తారని నమ్మకం తో పాటు బాల్య వివాహాలు జరగకుండా చూ డగాలిగామని ఆయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ పధకం క్రింద 56,194 మందికి వారి వారి ఖాతాలలో దాదాపు 427.27 కోట్ల రూపాయలు జమ చేసామని చెప్పారు.

SC లకు గత ప్రభుత్వం లో 40,000 రూపాయలు అందిస్తే అది ఇప్పుడు 1,00,000 కు పెంచామని చెప్పారు. SC లకు కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకి గత ప్రభుత్వం లో 75,000 సాయం ఉంటె అది ఇప్పుడు 1,20,000 రూపాయలకు పెంచామని చెప్పారు. ST లకు గత ప్రభుత్వం 50,000 అందిస్తే అది ఇప్పుడు 1,00,000 కి పెంచామని చెప్పారు.

ST లలో కులాంతర వివాహం చేసుకున్నవాళ్ళకు 75,000 ఉంటే ఇప్పుడు దానిని 1,20,000 పెంచామని చెప్పారు. అలాగే BC లకు గత ప్రభుత్వం 35,000 సాయం అందిస్తే అది ఇప్పుడు 50,000 రుపాయలకు పెంచామని చెప్పారు. అంతే కాకుండా విభిన్న ప్రతిభావంతులకు 1,50,000 రూపాయలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.

Leave a Comment