ఒక వ్యక్తి మరణించిన తర్వాత శరీరం మాత్రమే నశిస్తుంది కానీ ఆ వ్యక్తి ఆత్మ బతికే ఉంటుంది పండితులు చెప్తున్నారు. ఆత్మ అనేది ఎన్నటికి చావదు. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వారికి గుర్తుగా కొంతమంది వాళ్ళ మీద ప్రేమ తోనో జ్ఞాపకాలుగానో వస్తువులు పదిలం గా ఉంచుకుంటారు. ఇందులో ఎక్కువగా మరణించిన వారి బట్టలు లేదా వస్తువులు వాడేవారు ఎక్కువగా ఉంటారు. కానీ కొంతమంది చనిపోయిన వారి వస్తువులను లేదా వారి దుస్తులను వేరే వారికి దానం చేస్తూ ఉంటారు. మన ఇంటిలో చనిపోయిన వారికి సంబంధించిన ఏ వస్తువులు అయిన అవి మనం వాడకూడదు అని చెప్తున్నారు పండితులు. దీని గురించి గరుడ పురాణంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి వస్తువులు గాని వారి దుస్తులు గాని వాడకూడదని చెప్పడం జరిగింది. చనిపోయిన వారు వస్తువులు గాని వారి దుస్తులు గాని వాడడం వల్ల నెగటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం ఉంది.
దీని కారణం గా మరణించిన వ్యక్తి తన శరీరాన్ని విడిచిపెట్టిన కూడా భౌతిక ప్రపంచంలో తనకు ఉన్న అనుబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేడు. చనిపోయిన వారి ఆత్మ తన సొంత వ్యక్తుల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఈ కారణం వల్లే చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు గాని దుస్తులు గాని వాడకుండా దానం చేయడం మంచిదని పండితులు చెప్తున్నారు. గరుడ పురాణంలో చెప్పినట్లు, చనిపోయిన వారి వస్తువులు గాని దుస్తులు గాని వాడడం వల్ల ఆ చనిపోయిన వారి ఆత్మ వీళ్ళని ఆకర్షించడం జరుగుతుంది. ఇలా ఆత్మ ఆవహించినప్పుడు ఆ వ్యక్తి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు గాని దుస్తులు గాని వాడకుండా దానం చేయడమే మంచిది