జంట నగర వాసులకు చల్లని కబురు – రాబోయే 3 రోజుల్లో

website 6tvnews template 80 జంట నగర వాసులకు చల్లని కబురు - రాబోయే 3 రోజుల్లో

జంట నగర పౌరులు కొద్ది రోజులు గా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వేసవి రాకుండా సూర్యుడు నగర ప్రజల మీద ఆయన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటె ఇక మార్చ్,ఏప్రిల్,మే నెలల పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో అని నగర ప్రజలు భయపడుతున్నారు.

ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కరెంట్ వాడకం కుడా భారీగానే పెరిగిందని చెప్పింది. దీని ఫలితంగా ఏసీ లు, కూలర్లు , ఎక్కువ వినియోగం లో ఉండడం వల్ల విద్యుత్ కి తీవ్ర డిమాండ్ పెరిగింది.అంతే కాకుండా జంట నగరాలలో కొన్ని ప్రాంతాలలో నీటి సమస్యలు రావడం తో నీరు లేక టాంకర్లు ద్వారా నీళ్ళు తెప్పించుకుంటున్నారు గృహ వినియోగదారులు.

ఇలాంటి తరుణం లో వాతావరణ సఖ ఒక చల్లని కబురు మోసుకు వచ్చింది. రాబోయే 3 రోజుల్లో జంట నగరాలలో పాటు తెలంగాణ లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని చెప్పింది. దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతం నుండి ఈశాన్య వాయుగుండం ఏర్పడటం తో పాటు గాలి లో తేమ కారణం గా తెలంగాణ లో తూర్పు ప్రాంతాల్లో కుడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈనెల 24 తేదీ నుండి 26 తేదీ వరకు మద్య వర్షాలు పడతాయని చెప్పింది.

Leave a Comment