తరగతి గది లోకి మొబైల్ ఫోన్స్ నిషేధం – ప్రధాని కీలక ప్రకటన

130518623 kidsonphones2 తరగతి గది లోకి మొబైల్ ఫోన్స్ నిషేధం - ప్రధాని కీలక ప్రకటన

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతి లో చిన్న పెద్ద తేడా లేకుండా విపరీతం గా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా గంటల తరబడి మొబైల్ ఫోన్ ల తోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనికి ఇల్లు, ఆఫీస్ లు , కాలేజ్ లు, స్కూల్స్ అనే బేదం లేకుండా ప్రతీ ఒక్కరు వాడేస్తున్నారు.

ముఖ్యం గా చిన్న పిల్లలు ఈ మొబైల్ ఫోన్ బానిస లు గా మారిపోతున్నారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సమయం లో బ్రిటీష్ ప్రధాని రుషి సునాక్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట మొబైల్ ఫోన్స్ ను స్కూల్స్ లోకి అనుమతించరు.

rishi sunak downing street speech 1504x846px తరగతి గది లోకి మొబైల్ ఫోన్స్ నిషేధం - ప్రధాని కీలక ప్రకటన

మొబైల్ ఫోన్స్ వల్ల పిల్లల మీద పడే ప్రభావం దృష్టి లో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ మొబైల్ ఫోన్స్ వల్ల క్లాస్ రూమ్ లో ప్రశాంత వారవరణం ఉండడం లేదని ఆయన అన్నారు. పిల్లలు క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పేవి అసలు ఎం వినడం లేదని, దీనికి కారణం మొబైల్ ఫోన్స్ అని చెప్పారు. ఇప్పటికే చాల స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ నిషేదించామని ఆయన చెప్పారు.

విరామ సమయాలతో సహా పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌లను నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం ఫిబ్రవరి 19న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉపాధ్యాయుల కోసం కూడా ప్రత్యేక మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. విద్యార్థులకు సురక్షితమైన మరియు మెరుగైన విద్యా వాతావరణానికి ఇది ఉపయోగంగా ఉండనుంది. మొబైల్ ఫోన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియేషన్‌లకు కూడా దూరంగా ఉండొచ్చు.

అంతే కాకుండా విరామ సమయం లో కుడా మొబైల్ ఫోన్స్ అతిగా వాడుతున్నారని నిషేదించ డానికి ఇది ఒక కారణం అని ఆయన చెప్పారు. స్కూల్స్ పని చేసే టీచర్స్ కూడా కొన్ని ప్రత్యక గైడ్ లైన్స్ విడుదల చేసామని ఆయన చెప్పారు. స్కూల్ పిల్లలకు మెరుగైన విద్యా విధానం అమలు చెయ్యడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక ప్రఖ్యాత హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన రిపోర్ట్ లో మొబైల్ ఫోన్స్ వాళ మెదడు మీద నే కాకుండా నాడీ వ్యవస్ద మీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆయన చెప్పారు.

Leave a Comment