తెలంగాణా అభివృద్ధి కోసం త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ – C.M.రేవంత్ రెడ్డి

Revanth CII 2 తెలంగాణా అభివృద్ధి కోసం త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ - C.M.రేవంత్ రెడ్డి

ఈ మాస్టర్ ప్లాన్ క్రింద అర్బన్, సెమి అర్బన్, రూరల్ అని 3 బాగాలు గా విభజించి అభివృద్ధి చేస్తామని ఆయన ఒక ప్రకటన లో తెలియజేసారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలని కలుపుతూ ఒక రీజినల్ రింగ్ రోడ్డు ను త్వరలోనే మాస్టర్ ప్లాన్ రెడీ చేసి రింగ్ రోడ్డు ను అందరికి అందుబాటు లో ఉండే విధం గా తొందర లోనే తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇటీవల నానక్ రామ్ గూడా లోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ నూతన భవనాన్ని c m రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, y.s.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రం విడిపోయాక k.c.r. గారు నగర అభివృద్ధి లో తమ వంతు సహకారం అందించారని ఆయన చెప్పారు.

గడచినా ౩౦ సంవత్సరాలు గా నగర అభివృద్ధి కోసం అందరు విశేషం గా కృషి చేసారని ఆయన ప్రశంసలు కురిపించారు. రాజకీయాలు కు అతీతం గా వారు తీసుకున్న నిర్ణయాలతో పాటు వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని తమ ప్రభుత్వం కూడా నగర అభివృద్ధి కి కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

నగర శివారు ప్రాంతాల వారికి అందుబాటు లో ఉండే విధం గా ఒక రిజినల్ రింగ్ రోడ్డు తీసుకువచ్చి హైదరాబాద్ నగరం తో అనుసందానం చేసి ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తామని ఆయన చెప్పారు.

అంతే కాకుండా ఈ రింగ్ రోడ్డు చుట్టు మెట్రో రైల్ సదుపాయం ఉండేలా తగిన ప్రణాలికలు తీసుకువస్తామని ఆయన చెప్పారు. దీనికి కోసం నిపుణులను తోను, అనుభవజ్ఞులు తోను సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకుని డెవలప్ చేస్తామని చెప్పారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం గా మెట్రో లను, ఫార్మాసిటి లను తమ ప్రభుత్వం రద్దు చెయ్యలేదని ఆయన చెప్పారు.

ఇప్పుడు ఉన్న మెట్రో స్టేషన్ లతో కలుపుతూ మెట్రో ను మరింత విస్తరణ చేస్తున్నామని ఆయన ఒక ప్రకటన లో తెలియచేసారు. అంతే కాకుండా కొత్తగా కొన్ని ఫార్మా విలేజ్ లు నెలకొల్పాలని అనుకున్నామని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వం ఫర్మా సిటి కట్టే పరిస్థితి లేదంటూ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర లోనే అతి ప్రమాదకర ఔషధాల తయారి సంస్దలను అక్కడకి తీసుకురావడం సరియైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఫార్మా ను సిటీ లో ఏర్పాటు చేయాలని అనుకుంటే తమ ప్రభుత్వం పల్లెల లో ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కొరకు పాటు పడుతున్నామని ఆయన చెప్పారు

తమ ప్రభుత్వం దాదాపు 10 నుండి 15 గ్రామాలలో ఫార్మాసిటి ఏర్పాటు చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అందరికంటే ముందుగా ఆ ఘటనా స్ధలం లో ఉండేది ఫైర్ డిపార్ట్మెంట్ అని వారు ప్రజలకు చేస్తున్న సేవలకు అలాగే ప్రమాదం కుడా లెక్క చెయ్యకుండా ఎన్నో ప్రాణాలను కాపాడారని అందుకు మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన అన్నారు.

ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు సొంత భవనం లేకపోవడం దురదృష్టకరం ఆయన చెప్పారు. ఏ నగరం లో అయితే శాంతి భద్రతలు మంచి గా ఉంటాయో అక్కడ అభివృద్ధి బాగా పెరుగుతుందని ఆ విషయం లో మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంటూ ముందుకు పోతామని ఆయన చెప్పారు.

Leave a Comment