త్వరలో సినీతారల క్రికెట్ టోర్నమెంట్ – ఎలా చూడాలంటే

c8aab248 bb1a 43c9 84a7 b5912194fe84 త్వరలో సినీతారల క్రికెట్ టోర్నమెంట్ - ఎలా చూడాలంటే

మనం అప్పుడప్పుడు ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరు. చిన్న హీరో లు పెద్ద హీరో లు అంతా కలిసి ఒకే సారి ఒకే సమయం లో కనిపిస్తే ఆ రోజు పండగే. అయితే వాళ్ళు సినిమా లో నటించి హీరోలుగా పాపులర్ అవ్వడం అనే నార్మల్. కాని రియల్ గా ఒక గేమ్ ఆడి, అది కూడా ఎంతో మందిని టీవీలకు అతుక్కుపోయేలా చేసేలా గేమ్ “క్రికెట్ ” గురించి తెలియని వారు ఉండరు.

మరి అలాంటి క్రికెట్ లో భాషా ప్రాతిపదిక మీద అంటే దక్షిణ భారత దేశం లో ఉండే భాషలు అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం పాటు ఉత్తర భారత దేశం ఉన్న రాష్ట్రాలు అంటే హిందీ,బెంగాలి, భోజ్పూరి, పంజాబీ భాషల కు సంబందించిన సినీతారలు వివిధ రంగాల టెక్నీషియన్ లు అందరు కలిసి సెలెబ్రెటి క్రికెట్ లీగ్ అంటే CCL అని పేరు పెట్టి ప్రతీ సారి కొన్ని మ్యాచ్ లు ఆడడం చూస్తూ ఉంటాం.

మరి ఈసారి ఆ పండగ తిరిగి ఫిబ్రవరి 23 నుండి మార్చ్ 17 వరకు జరుగుతాయి. అయితే ఈ సారి కొన్ని మ్యాచ్ లు దుబాయ్ వేదిక గా ఫిబ్రవెరి 23 నుండి 25 వరకు జరుగుతాయని CCL ప్రతినిధులు ఒక ప్రకటన జారీ చేసారు. మిగిలిన మ్యాచ్ లు అంటే ఫిబ్రవరి 26 నుండి మార్చ్ 17 వరకు హైదరాబాద్ , వైజాగ్, త్రివేండ్రం, చండీగడ్ లలో మ్యాచ్ లు జరుగుతాయని చెప్పారు. ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 20 మ్యాచ్ లు ఉంటాయని చెప్పారు

Leave a Comment