నాయిస్ నుండి నయా వాచ్.. దీని బ్యాటరీ బ్యాకప్ ఎంతో తెలుసా ?

1980 90ల కాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండ చేతి గడియారం పెట్టుకునే వారు. కానీ 2005 నుండి 2015 వరకు వ్రిస్ట్ పెట్టుకోవడం పట్ల యూత్ పెద్దగా ఆశక్తి చూపేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో యువత అధికంగా స్మార్ట్ యాక్ససరీస్ వినియోగిస్తున్నారు. అంతే కాదు వాటిని వాడటం పట్ల ఇష్టాన్ని చూపుతూహున్నారు. ముఖ్యంగా తాము వాడే స్మార్ట్ ఫోన్‌ కు లింక్ చేసుకునే వెసులుబాటు ఉండటం వల్లనే ఈ స్మార్ట్ యాక్ససరీస్ కి క్రేజ్ బాగా ఎక్కువ ఉందని చెప్పాలి. యూత్ లో వీటి పట్ల ఉన్న ఆదరణను దృష్టి లో పెట్టుకునే అనేక కంపెనీలు ఎప్పటికప్పుడు ట్రెండుకి తగ్గట్టు స్మార్ట్ యాక్ససరీస్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తూ మంచి బిజినెస్ రాబట్టుకుంటున్నాయి.

e842c031bc564cd62c971e2c6e6d9a38.w400.h400 నాయిస్ నుండి నయా వాచ్.. దీని బ్యాటరీ బ్యాకప్ ఎంతో తెలుసా ?

ఈ స్మార్ట్ వాచ్‌లో కేవలం డిజిటల్ రూపంలో టైం చూసుకోవడమే కాదు, హెల్త్ కి సంబంధించిన ఎలర్ట్స్ కూడా రావడంతో వీటిని బాగా వినియోగిస్తున్నారు ప్రస్తుత యువత. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసమే ప్రముఖ స్మార్ట్ వాచ్ మేకింగ్ కంపెనీ నాయిస్ ఇప్పుడు మార్చెట్ లోకి సరి కొత్త స్మార్ట్ వాచ్‌ ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ కి ఉన్న మెయిన్ క్వాలిటీ ఏమిటంటే ఇది పదిరోజుల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందించేలా నాయిస్ ఫిట్ యాక్టివ్-2 పేరుతో విడుదల చేశారు. ఈ కొత్తరకం స్మార్ట్ వాచ్ మార్కెట్ లో తప్పకుండా మంచి అమ్మకాలను నమోదు చేస్తుందని నాయిస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే నాయిస్ ఫిట్ యాక్టివ్-2 స్మార్ట్ వాచ్ కి సంబంధించి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.

నాయిస్ ఫిట్ యాక్టివ్-2 ని లాంచ్ చేయడంతో నాయిస్ కంపెనీ భారతదేశంలో తన స్మార్ట్‌వాచ్ పరిధిని మరింత విస్తరించుకుంటుందని చెప్పొచ్చు. ఈ స్మార్ట్‌ వాచ్ లో రౌండ్ డయల్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే ని కలిగి ఉంటుంది. ఇలా రౌండ్ డయల్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే ని కలిగి ఉండటం వల్ల ఈజీ నావిగేషన్ తోపాటు వివిధ రకాల పెనులకు వెంటనే యాక్సెస్‌ను అందిస్తుండటమే కాక చాల బాగా సహకరిస్తుందని చెబుతున్నారు. నాయిస్ ఫిట్ యాక్టివ్-2 స్మార్ట్ వాచ్ ను ఫ్లిప్‌కార్ట్ లో మాత్రమే కాక, నాయిస్‌ సంబంధించిన అన్ని అధికారిక వెబ్‌సైట్‌లో మనం కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. క్లాసిక్ బ్లాక్, కాపర్ బ్లాక్, కాపర్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్, వింటేజ్ బ్రౌన్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి ఆరు రంగుల వేరియంట్‌ కలర్స్ ఉంటాయి. వీటితోపాటు లెదర్ స్ట్రాప్‌ల తో కూడా ఈ స్మార్ట్ వాచెస్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఇక ఈ స్మార్ట్ వాచ్ ధర మార్కెట్ లో 3,499 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని తెలుస్తోంది.

Ylz69SO3 నాయిస్ నుండి నయా వాచ్.. దీని బ్యాటరీ బ్యాకప్ ఎంతో తెలుసా ?

నాయిస్ ఫిట్ యాక్టివ్-2 466×466 రిజల్యూషన్ తో వస్తోంది, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.46-అంగుళాల హైపర్ విజన్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో మన దీనిని చూడొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ మెటల్ బిల్డ్, అలాగే ఫంక్షనల్ క్రౌన్ బటన్‌తో కనిపిస్తుంది. ఇక దీనిలో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి, అలాగే ఈ స్మార్ట్ లో 150 అంతకన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉండటం మెరుగైన అంశంగా చెప్పొచ్చు. ఈ సదుపాయం వారి కస్టమర్లకు సరిపోయేలా చేసి వారి నుండి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేస్తుంది. నాయిస్ ఫిట్ యాక్టివ్-2 ట్రూ సింక్ ఫీచర్‌ ను ప్రవేశ పెట్టి, బ్లూటూత్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా మెరుగుపరిచారు. కాబట్టి కాల్స్ చేసుకునే సమయంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు కస్టమర్లు.

Leave a Comment