పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మౌనిక..

మంచు మనోజ్ – మౌనిక దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇప్పటికే ఈ దంపతులకు ఒక మగ బిడ్డ ఉండగా ఇప్పుడు ఆడ బిడ్డ కలిగింది. ఈ శుభవార్తను మనోజ్ సోదరి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మంచు ఫ్యామిలీ లోకి కొత్త మెంబర్ ఎంటర్ అయ్యారని తెలిపింది. ఇక మంచు లక్ష్మి ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఒక చిలిపి పని చేసింది. మనోజ్ కుమార్తెకు ఎంఎం పులి అని ముద్దుపేరు పెట్టింది. ఎంఎం అంటే బహుశా మనోజ్ మౌనిక పేర్లలో మొదటి అక్షరాలు అయినా అయి ఉండొచ్చు, లేదంటే మంచు మనోజ్ లోని మొదటి అక్షరాలు అయినా అయి ఉండొచ్చు అని నెటిజన్లు భావిస్తున్నారు.

manoj పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మౌనిక..

అయితే మరోసారి మేనత్త అయిన మంచు లక్ష్మి తన కొత్త మేనకోడలి ఫోటో మాత్రం బయటపెట్టలేదు. మంచు మనోజ్ మౌనికలది ప్రేమ వివాహం. వీరిద్దరికి గతంలో విడివిడిగా పెళ్లిళ్లు అయ్యాయి, కానీ వారి వైవాహిక బాంధవ్యం నిలబడలేదు, దాంతో వారు విడిపోయారు. ఆతరవాతే మనోజ్ మౌనిక ఒక్కటయ్యారు. 2023 లో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక మౌనిక ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆ విషయాన్నీ కూడా మంచు ఫ్యామిలీ ఫాన్స్ తో పంచుకోవడమే కాక ఆమె సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నాడు మనోజ్.

Leave a Comment