దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Loksabha Elections) నగరా మ్రోగినప్పటి నుండి రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఎన్నికల హడావుడీనే కనిపిస్తోంది. దేశం లోని అని రాష్ట్రాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి, లోక్ సభ ఎన్నికలే కాక కొన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అయితే ఇప్పుడు మనం ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) గురించి మాట్లాడుకోవాలి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా పేరుంది ఉత్తర్ ప్రదేశ్ కి, ఉత్తరప్రదేశ్ లో ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా యూపీ లో రాజకీయ యోధుడిగా పేరుపొందింన దివంగత నేత, ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) కుటుంబంలోని మూడో తరం కూడా ఎన్నికల ప్రచార పర్వం లోకి అడుగు పెట్టింది. మాజీ ,ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) భార్య డింపుల్ యాదవ్(Dimple Yadav) ప్రస్తుతం మైన్ పురీ లోక్ సభ స్థానం నుంచి పోటీ కి దిగింది. దీంతో తల్లికి మద్దతుగా ఆమె కుమార్తె అదితీ యాదవ్(Adithi Yadav) నడుం బిగించింది. తన తల్లి గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది.
గెలుపు కష్టమేనా ? Is Dimple Victory Difficult
కేవలం ప్రచారానికి వెళ్ళమంటే వెళ్ళాం అన్నట్టు కాకుండా అదితి అదరగొట్టేస్తోంది. తన పదునైన ప్రసంగాలతో అటు ప్రజలను ఇటు ఓటర్లను సైతం ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇక అదితి ఎక్కాడు వెళ్లినా ఆమెను చూసేందుకు ప్రజలు బాగా ఉత్సాహం చూపెడుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఎగబడుతున్నారు. ఇక అదితి విషయానికి వస్తే ఆమె లండన్ లో చదువుకుంటోంది. ప్రస్తుతం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఆమె సెలవులను ఎంజాయ్ చేయడానికి బదులు ఎన్నికల ప్రచారంలోకి తలదూర్చేసింది. తన తల్లి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేపట్టింది. ములాయం సింగ్ మరణానంతరం అయన కోడలు డింపుల్ ఇదే మైన్ పురీ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం మైన్ పురీ ఎంపీగా ఉన్న ఆమె, ఈ దఫా ఎన్నికలకు కూడా ఆమె అదే స్థానాన్ని ఎంచుకుంది. అయితే ఈ సారి ఆమెకు విక్టరీ అంత సులభం కాదని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అయితే డింపుల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆక్రమం లోనే ఆమె బీజేపీ(Bharatiya Janata Party) పార్టీని, ప్రధాని మోదీని(PM Modi) లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలూ సంధిస్తున్నారు.