పూరి డిఫరెంట్ లుక్ చూశారా ? (Double Ismart) డబుల్ ఇస్మార్ట్ పనుల్లో బిజీ

Add a heading 34 1 పూరి డిఫరెంట్ లుక్ చూశారా ? (Double Ismart) డబుల్ ఇస్మార్ట్ పనుల్లో బిజీ

ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం పనికి రాదు అంటారు పెద్దలు. ఆ అతి విశ్వాసమే కొన్ని సార్లు టాప్ లిస్ట్ లో ఉన్న వారిని కూడా ఢమాల్ అంటూ కిందకి నెట్టేస్తుంది.

సరిగ్గా లైగర్ విషయంలోకూడా ఇలానే జరిగింది. లైగర్ పై పూరి చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ తో పూరికి ఫ్రీక్వెన్సీ కూడా బాగానే మ్యాచ్ అయింది.

వాళ్ళు అనుకున్నట్టే సినిమా వచ్చిందని భావించి రెచ్చిపోయారు. సినిమా గురించి ఓ రేంజ్ లో ఊదర గొట్టేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మి, విజయ్ ల స్పీచ్ సినిమా పై ఎక్కడలేని హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లాలంటూ చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

కానీ లైగర్ విడుదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ప్లాప్ అవ్వడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.

లైగర్ తరువాత వెంటనే పూరితో జనగణమన అనే సినిమా చేస్తానని చెప్పిన విజయ్ ఆతరువాత ఆ సినిమాకే జనగణమన పడేశాడు.

ఇక కొత్త సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ప్రస్తుతం పూరి హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అయినా డబుల్ ఇస్మార్ట్ తీస్తున్నాడు. ఫ్లాపుల్లో కూరుకుపోయిన ఛార్మి పూరీలు ఈ డబుల్ ఇస్మార్ట్ తో అయినా పూర్వ వైభవాన్ని సాధించుకోవాలని తెగ ట్రై చేస్తున్నారు.

ఎప్పుడూ లాంగ్ హెయిర్ టోన్ ఉండే పూరి ఇప్పుడు డిఫెరెంట్ లుక్ లో ఉన్నాడు. బాగా షార్ట్ హెయిర్ చేయించుకున్నాడు. అసలు గుండు చేయించుకున్నాడా అనే అనుమానం కూడా వస్తోంది పూరీని చూస్తుంటే. ఇక రామ్ విషయానికి వస్తే స్కంద సినిమాతో మంచి వసూళ్లు రాబట్టాడు. సినిమా పై డివైడ్ టాక్ వచ్చినా కాసుల వర్షం కురిపించింది స్కంద. ఆ ఫేమ్ తన డబుల్ ఇస్మార్ట్ కి పనికొస్తుందని ఆశిస్తున్నాడట పూరి.

Leave a Comment