మీడియా అధిపతులు అమ్ముడుపోయారని K.A.పాల్ విమర్శించారు. తాను ఒక కోర్టు ఆర్డర్ తీసుకువస్తే ఒక్క చానెల్ కూడా లైవ్ కవరేజ్ ఇవ్వలేదని, ఎదో ఒక చానెల్ లైవ్ చేస్తూ మధ్యలో తీసేసింది అని దుయ్యబట్టారు.
తాను ఎలక్షన్స్ ఏప్రిల్ పెట్టవద్దని మే లో నిర్వహించమని తాను కోర్టు ను అడగడం వల్లే ఎలక్షన్స్ మే లో పెడుతున్నారని ఆయన చెప్పారు తాను స్టీల్ ప్లాంట్ విషయం లో పోరాడుతుంటే ఒక్కరు కూడా తనకు సహకరించడం లేదని ఆయన విమర్శించారు.
తాను ఏ మీటింగ్ లు పెట్టిన లేదా ప్రెస్ మీట్ కి రమ్మని చెప్పిన తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని అంటూనే ఇదద్ విధం గా అన్నారు. ” నేను కనక శపించాను అంటే మీరు, మీతో పాటు కుటుంబాలు నాశనం అయిపోతాయు” నాతొ జాగ్రత్త గా ఉండండి అన్నారు.
పలికి మాలిన వాటికి లైవ్ కవరేజ్ చేస్తూ అవసరం అయిన నా లాంటి వాళ్ళను పట్టించుకోరా అంటూ ఆయన ఆక్రోశం వెళ్ళకక్కారు. ఎలెక్ట్రానిక్ మీడియా నే కాదు ప్రింట్ మీడియా కూడా అలానే తయారయ్యింది అంటూ ప్రింట్ మీడియాను కుడా వదలలేదు. నాకు అన్యాయం చేసిన ఏ ఒక్క చానెల్ ని వదిలి పెట్టనని వాళ్ళ సంగతి కోర్టు లో చూసుకుంటాను అని ఆయన భీష్మ ప్రతిజ్ఞా చేసారు.