మలయాళం లో విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ దృశ్యం. ఇది పలు బాషలలో కూడా విడుదల అయ్యి ఘన విజయం సాదించాయి. ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కి ఏకంగా హాలీవుడ్ లో రిమేక్ చయ్యబడుతోంది. ఈ విషయం రీసెంట్ గా పనోరమా స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పడు హాలీవుడ్ లో గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, జెఒఏటి ఫిలిమ్స్ తో కల్సి పని చేయ్యబోతున్నాం అని త్వరలోనే మరిన్ని వివరాలు అందజేస్తామని వారు చెప్పారు.
అన్ని సౌత్ ఇండియన్ బాషలలో విడుదల అయ్యి మంచి హిట్ కొట్టాయని దానిని దృష్టి లో ఉంచుకునే హిందీ లో కూడా విడుదల చేసామని అక్కడ కూడా మంచి వసూళ్లు తెచ్చిపెట్టిందని చెప్పారు. దీనిని దృష్టి లో పెట్టుకుని దృశ్యం పార్ట్ 2 కూడా విడుదల చేసామని అది కూడా మంచి హిట్ అందుకుందని చెప్పారు.
ఈ సినిమాలో అగ్ర హీరోలు చెయ్యడం బాగా కల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని బాషల లో ఈ మూవీ మంచి హిట్ అందించిన వసూళ్లు కలెక్ట్ చేసిన భాష ఏంటంటే హిందీ. మాకు అన్ని బాషల లో కన్నా హిందీ మూవీ మీద ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పారు. ఫస్ట్ మలయాళం లో తీసిన ఈ మూవీ కి 25 కోట్లు వచ్చాయని. కాని హిందీ లో తీసిన దృశ్యం కు 313 కోట్లు రావడం చాల ఆశ్చర్యం కలిగించిందని, దీనికి మెయిన్ కారణం అజయ్ దేవగన్, శ్రియ శరణ్ అధ్బుత నటనే అని ఆయన అన్నారు.
ఇప్పుడు హాలీవుడ్ కి వెళ్తున్నాం మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అని ఆయన అన్నారు. అప్పట్లో దృశ్యం పార్ట్ 3 కుడా త్వరలో రాబోతోందని మేకర్స్ చెప్పడం విశేషం. మరి వేచి చూడాలి పార్ట్ 3 ఎప్పడు వస్తుందో. ముందు ఏ మూవీ పట్టాలు ఎక్కుతుందో వేచి చూడాలి మరి.