మాఘ మాసం లో పొర్ణమి నాడు ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయి

website 6tvnews template 73 మాఘ మాసం లో పొర్ణమి నాడు ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయి

ప్రతీ ఏటా మాఘ మాసం లో వచ్చే పొర్ణమి కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి దైవ కార్యాలకైన అలాగే మన ఇంటి సంబందించిన మంచి పనులైన ప్రారంబించడానికి ఈ మాఘ మాసం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘ పొర్ణమి రోజున నదీ స్నానం చెయ్యడం వల్ల పుణ్య ఫలం లభిస్తుందని మన పురాణాలలో ఉంది. ఈ రోజున చంద్రుడు ని పూజించడం వల్ల ఎంతో మేలు కల్గుతుందని పెద్దలు చెప్తారు.

అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున విష్ణువు ని లక్ష్మి దేవిని కలిపి పూజిస్తే సకల కోరికలు తీరతాయని మహర్షులు చెప్పినట్లు గ్రంధాలలో రాసి ఉందని చెప్తారు మన పూర్వికులు. అలాగే ఇదే రోజున తులసి మొక్కని భక్తి శ్రద్ధలతో పూజించాలని మన పెద్దలు చెప్తారు. తులసి మొక్క లేకుండా విష్ణువుని, లక్ష్మిని దేవిని పూజించిన పూజాఫలం పూర్తిగా లభించదని చెప్తారు.

ఈరోజున విష్ణువు ని లక్ష్మి దేవిని తమ శక్తీ కొలది రకరకాల పుష్పాలతో
పూజా మండపాన్ని అందం గా అలంకరించిన అనంతరం పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. విష్ణువు అలంకార ప్రియుడు అందుకని విష్ణువు తో పాటు లక్ష్మి దేవిని కూడా రంగు రంగు పుష్పాలతోను, రంగు రంగు
వస్త్రాల తోను అందం గా అలంకరించుకోవాలి.

ఈరోజున సాత్వికంగా ఉండే వాటిని దేవుడికి నైవేద్యం గా పెట్టాలి, ఈ పర్వదినం రోజున మన తెలుగు వారే కాకుండా దేశం లో హిందువలందరూ వారి వారి సాంప్రదాయ పద్ధతి ప్రకారం కొందరు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే, కొందరు ఈరోజున ఆంజనేయుడిని పుజిస్తారు. ఎవరు ఏ దేవుడిని పూజించిన భక్తి, శ్రద్ధలతో పూజించినట్లయితే తప్పకుండా వారి కోరికలు తీరతాయని హిందూ భక్తుల విశ్వాసం.

ఈ రోజున ప్రధానం గ చేయవలసిన దానాలు :

ఏరోజున మనం చేసే దానాలకు విశేష ఫలితం చేకూరుతుంది. ముఖ్యం గా పేదవారికి దానం చెయ్యడమనేది విశేషం గ చెప్పవలసిన సూచన, తమ శక్తీ కొలది,తోచిన విధం గా చేసిన దానం అన్నింటిలోకెల్లా గోప్ప దానం, ఎవరైతే పేదవారు ఆకలితో కాని బట్టలు లేకుండా భాధ పడుతున్నారో అటువంటివారికి వీటిని దానం చెయ్యడం వల్ల వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని మహర్షులు చెప్పడం జరిగింది.

ఈ రోజున సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు చెప్తారు. ఈరోజున ఎర్రని రంగు వస్తువులు దానం చేస్తే వారికి కుజ దోషం పోతుందని, తేనె,ఖర్జూరం దానం చేసినట్లయితే రాహు,కేతు దోషాలు పోతాయని చెప్తారు. అన్నం దానం చెయ్యడం వల్ల సమస్త భోగ భాగ్యాలు లభిస్తాయని పెద్దలు చెప్తారు.

Leave a Comment