మీ ఇంటిలో అనేక సమస్యలతో భాధపడుతున్నారా ! అది నెగిటివ్ ఎనర్జీ వల్లే

WhatsApp Image 2024 03 19 at 4.58.29 PM మీ ఇంటిలో అనేక సమస్యలతో భాధపడుతున్నారా ! అది నెగిటివ్ ఎనర్జీ వల్లే

ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకి ఏ విషయంలోనూ కలిసిరాదు అన్నింటిలోనూ మనకు వ్యతిరేకంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య కు పరిష్కారం ఒకటే మార్గం నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోంచి బయటికి పంపించి పాజిటివ్ ఎనర్జీ ని హ్వానించడం చెయ్యాలి.

ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎలా తొలగించుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి రెండు పదార్థాలు ఒకటి కర్పూరం రెండవది ఆవు నెయ్యి. ఒక స్పూన్ లో ఆవు నెయ్యిని తీసుకొని అందులో రెండు కర్పూరం బిళ్ళలు వేసి పొద్దున్న సాయంత్రం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అంతే కాదు భార్యా భర్తలకు అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తుంటే, అలా వచ్చినప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు దిండు కింద పెట్టుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోతుంది. పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత రెండు కర్పూరం బిళ్ళలు పడక గదిలో వెలిగించినట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.

కొద్దిగా ఆవు నెయ్యి మూడు కర్పూరం బిళ్ళలు కలిపి మన ఇంటి సింహద్వారం గడపకి రాసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి ప్రవేశించదు. రాత్రి పడుకున్న తర్వాత కొంత మంది కి పీడ కలల తో బాధపడేవారు ఉంటారు. ఆవు నెయ్యి కర్పూరం కలిపి రాయడం వల్ల వారికి పీడకలలు రావు. ఇప్పుడు ఇంకో పద్ధతి ఉంది అది ఏంటంటే శంఖం తీసుకుని దానిలో నీళ్లు పోసి అన్ని గదులు తిప్పిన తరువాత శంఖం లో ఉన్న నీళ్లను మనకు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తుందో అక్కడ ఆ నీళ్లను చిలకరించాలి అంటే ఆ ప్రదేశంలో జల్లాలి. ఇప్పుడు మరొక పద్ధతి ఏంటంటే ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో మూడు స్పూన్లు గళ్ళ ఉప్పు వేసి నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది.

Leave a Comment