
మన ఇళ్లలో బాత్ రూమ్ గమనిస్తే స్నానం చేశాక చాలా సమయం పాటు తడిగానే ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ తలుపు మూసే ఉంటుంది, పైగా గాలి అంటూ బాత్ రూంలోకి చొరబడదు కాబట్టు తడిగా ఉంటుంది అని మనం సరిపెట్టుకుంటాము. కానీ అది పూర్తిగా తప్పు, బాత్ రూమ్ లో స్నానం చేసిన తరువాత నీరు మొత్తం బయటకు వెళ్లిపోకుండా ఎక్కడో ఒక చోట నిలిచిపోతుంది, దాని వల్ల ఎక్కువ సేపు బాత్ రూమ్ తడిగా ఉంటుంది. అయితే అలా నీరు పల్లం లో నిల్వ ఉంది అస్తమానం బాత్ రూమ్ తడిగా ఉండటం అనర్ధమే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్‌రూమ్ ఎప్పుడూ తడిగా ఉంటే, అప్పుల తిప్పలు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మీ బాత్‌రూమ్‌ను పరిశుభ్రంగా ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సైన్స్ ప్రకారం చూసుకున్నా అది మనకు అనర్ధమే, నీరు నిలబడటం వల్ల రకరకాల క్రిములు చేరి ఇంట్లోనివారు రోగాలపాలయ్యే అవకాశం ఉంది.