ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖకు షిఫ్ట్ అవుతారని, ఇక మీదట పరిపాలన అక్కడి నుండే చేస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.
అందుకోసమే రుషికొండపై కొత్తగా భవనాలు కడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్యాటకానికి సంబంధించిన భవనాలు అని చెబుతూనే, పరిపాలనకు కూడా అనుకూలం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారట. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు హై కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ రుషికొండపై ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికల ఆధారంగానే హైకోర్టు మంగళవారం కీలకమైన ఉత్తర్వులు జారీచేసింది.
రుషికొండపై భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమే కడుతున్నారని ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అవి పర్యాటకశాఖ భవనాలని, రిసార్టుల కోసమే కట్టామని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు చుస్తే అవే భవనాలు సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలంగా ఉంటాయని, ఆ విషయాన్నీ ప్రకటించాలని భావిస్తోందట.