రాబోయే లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో ఎన్నికల తేది ఖరారు కానుంది. మార్చ్ 9 న కాని లేదా మార్చ్ రెండో వారం లో కాని ఎన్నికల సంఘం తేదీలు వుడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం సెంట్రల్ ఎలెక్షన్ కమీషన్ ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిసింది.
లోక్ సభ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కు ఎలెక్షన్ కమీషన్ గత కొన్ని రోజులు గ ఎలేక్షన్స్ జరిగే అన్ని రాష్ట్రాల లోను పర్యటించి వివారులు సేకరించడం మొదలు పెట్టింది.
రాజకీయ పార్టీలతోను, స్దానికం గా అధికారుల తోను పలు రకాల సమావేశాలను నిర్వహించి ఎన్నికల షెడ్యుల్ రెడీ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. మార్చ్ 9 వ తేది ఎలెక్షన్ కమీషన్ ఎన్నికల తేదీలను వుడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబందించి పలు జాతీయ మీడియా చానెల్స్ లో కధనాలు వచ్చాయి.
దేశ మొత్తం మీద లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల అనగా ఆంధ్ర ప్రదేశ్, ఓడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్దానాలకు ఈ సంవత్సరం మే నెలాఖరు లోగ ఎన్నికలు జరగవలసి ఉంది. అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలను జరిపించాలని ఎలెక్షన్ కమీషన్ అనుకుంటోంది.
దీనికోసం మార్చ్ 8 న కాని 9 న కాని కేంద్ర ప్రభుత్వ అధికారులు బృందం సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకోనున్నారు. జమ్ముకాశ్మీర్ లో భద్రత కు సంబందించి అనుకూల పరిస్థితి ల గురించి అవసరమైన కేంద్ర బలగాల గురించి అన్ని విషయాలు ఈ సమావేశం లో చర్చిస్తారు.
అనంతరం మార్చ్ 12 న కాని 13 న కాని ఎలెక్షన్ కమీషన్ బృందం క్షేత్ర స్దాయిలో పరిస్థితులను అన్నింటిని అంచనా వేస్తుంది. చర్చల అనంతరం మార్చ్ రెండో వారం లో ఎన్నికల షెడ్యుల్ ని ప్రకటిస్తారని వార్తలు అందుతున్నాయి.
ఇది వరకు లోక్ సభ ఎన్నికలు మార్చ్ 10, 2019 న షెడ్యుల్ విడుదల చేసారు. ఏప్రిల్ 11 తేదీ నుండి 19 వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23 తేదీ న ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి అదే రోజున ఫలితాలు ప్రకటించడం జరిగింది.
ఈ సారి కూడా ఏప్రిల్ కాని మే నెల లోనే ఎన్నికలు జరిగేల కేంద్ర ఎలెక్షన్ కమీషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అని ఎలెక్షన్ కమీషన్ ఒక ప్రకటన లో తెలియజేసింది.