Varun Lavanya marriage Mega Heros entry: వరుణ్ లావణ్య దంపతులతో మెగా హీరోస్
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల వివాహం అంగరంగ వైభవంగా ఇటలీలోని టస్కానీలో నిర్వహించారు. అటు కొణిదెల ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ అందరూ హాజరయ్యి నవ దంపతులను ఆశీర్వదించారు.
మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇక నూతన వధూవరులకు సినీ ఇండస్ట్రీలోని వారి ఫ్రెండ్ నుండి ఫాన్స్ వరకు అందరి నుండి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. ఈ కొత్త జంట పై మెగాస్టార్ చిరు చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి.
ఆ విధంగా వారు ప్రేమతో నిండిన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని, నవ తారల దంపతులకు తారల శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.
సినీ ఇండస్ట్రీలో ఉన్న వరుణ్ లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీతో బంధం పెనవేసుకుపోయి ఉన్న కొణిదెల అల్లు ఫ్యామిలీ అటెండ్ అవ్వడం ఈ తరహా ట్వీట్ కి కారణం ఏమో అంటున్నారు ఈ ట్వీట్ చూసినవారు.
కొత్త జంటతో మెగా కాంపౌండ్ హీరోలు ఫోటోకి ఫోజిచ్చారు. ఆ ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు.
ఈ ఫోటోను చుసిన మెగా ఫాన్స్ సంతోషానికి అవధులు లేవంటే నమ్మండి, ఆ ఫోటోను వారు తెగ షేర్ చేసేస్తున్నారు.