చాల మంది తల్లి తండ్రులు తమ పిల్లల కోసం సంపాదించిన డబ్బు వాళ్ళ ఆనందం కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. తర్వాత వృద్ధాప్యం లో తమ కోసం ఆలోచించరు, ఇలా ప్రతి తల్లి తండ్రులు చేసేదా కదా ! అంతే కాదు 60 సంవత్సరాలు మీదకు వచ్చాక వృద్ధాప్యం లో వాళ్ళు ఏ ఇబ్బంది పడకూడదని కేంద్ర ప్రభుత్వం ఓ పధకం ప్రవేశపెట్టింది అదే ” అటల్ పెన్షన్ యోజన “.
ఈ పధకం లో చేరాలంటే మాత్రం 18 నుండి 40 సంవత్సరాలు మద్య ఉన్నవారు ఎవరైనా ఈ పధకం లో చేరవచ్చు. కేవలం రోజుకు 7 రూపాయలు అదా చెయ్యడం వల్ల నెలకు మీరు 5 వేలు వరకు పెన్షన్ తీసుకోవచ్చు. మీరు 18 ఏళ్ల వయస్సు లో ఈ పధకం లో చేరితే రోజుకు 7 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు నెలకు కట్టేది 210 రూపాయలు అవుతుంది.
అలా మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు మీరు ప్రీమియం కడుతూ ఉండాలి. మీకు వయస్సు పెరిగేకొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు వృద్ధాప్యం పడేసరికి మీకు నెల నెల 5 వేలు చొప్పున పెన్షన్ వస్తుంది. ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న ఏ జాతీయ బ్యాంకు కు వెళ్ళిన ఈ అటల్ పెన్షన్ యోజన లో చేరండి తర్వాత్ నిశ్చంత గా ఉండండి.
ఏ ఏ వయస్సు వారు ఈ పధకం లో చేరితే వారు నెలకు ఎంత కట్టాలో తెలుసుకుందాం:
NO.| AGE | MONTHLY AMOUNT
- 20 248=00
- 21 269=00
- 22 292=00
- 23 318=00
- 24 346=00
- 25 376=00
- 26 409=00
- 27 446=00
- 28 485=00
- 29 529=00
- 30 557=00
- 31 630=00
- 32 689=00
- 40 1454=00