హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు – కారణం ఏమిటంటే

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఈ సారి అయన బెయిల్ కోసమో లేదంటే పాత కేసుల విచారణ నిమిత్తమో కోర్టు మెట్లు ఎక్కలేదు, చంద్రబాబు కోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దేని గురించి అంటే, 2019 నుండి ఇప్పటివరకు తమపై ఏవైతే కేసులు నమోదయ్యాయో వాటన్నిటి తాలూకు వివరాలు ఇప్పించాలని కోరారు. అయితే ఇదే తరహా కేసులు చంద్రబాబు తోపాటు అయన తనయుడు ఆపార్టీ యువనేత నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పొంగూరు. నారాయణ కూడా పిటిషన్లు వేశారు. వీరు కూడా తమపై నమోదైన కేసుల వివరాలను ఇప్పించాలని హైకోర్టును కోరినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్ల కు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 16లోగా వారిపై ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి అందజేయాలని డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇప్పటికిప్పుడు వారు తమ కేసులకు సంబంధించిన వివరాల కోసం ఎందుకు పిటిషన్ వేశారా అని అనుమానం రావచ్చు. ఎందుకంటే ఎన్నికలలో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాల దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కు అందజేయాల్సి ఉంటుంది.

Nara Lokesh Chandrababu Naidu హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు - కారణం ఏమిటంటే

ఈ క్రమంలో వారు సమర్పించే సమాచారంలో ఏ ఒక్కటి సమాచారమైనా తప్పు ఉన్నా లేదంటే తగ్గినా వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరంతా తమ కేసుల వివరాల కోసం కోర్టును ఆశ్రయించక తప్పలేదు. ఈ విషయంలో టీడీపీ నాయకుల వాదన మరోలా ఉంది, ఇది వరకే తమ అధినేత చంద్రబాబు తన పై ఉన్న కేసుల వివరాలు కోరుతూ డీజీపీ కి లేఖ రాసారని, కానీ ఇప్పటివరకు ఆ వివరాలు చంద్రబాబుకి ఇవ్వకపోవడం వెనుక అధికార పార్టీ కుట్ర దాగుందని ఆరోపిస్తున్నారు. కేసుల వివరాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా నామినేషన్ సమయంలో ఇదొక తప్పు జరుగుతుంది కాబట్టి, చంద్రబాబు, లోకేష్, అచ్చెనాయుడు, నారాయణ వంటి నేతపై అనర్హత వేటు పడుతుందనేది వారి వారి ఆలోచన అని అంటున్నారు. తన పార్టీ నేతలను ధైర్యంగా ఎదుర్కొనలేకే ఇలా కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు.

Leave a Comment