11.5 crore inactive PAN cards found : మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో వెంటనే లింక్ చేయండి.లింక్ చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్

Add a heading 2 11.5 crore inactive PAN cards found : మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో వెంటనే లింక్ చేయండి.లింక్ చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్

11.5 crore inactive PAN cards found : మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో వెంటనే లింక్ చేయండి. లింక్ చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి అవసరానికి ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారు. రేషన్ మొదలుకొని ప్రతి పధకానికి ప్రతి పనికి ఆధార్ ప్రధాన ఆధారమై కూర్చుంది.

అందుకే ఆమధ్య కాలంలో పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చుస్తే 70.24 కోట్ల మంది పాన్ కార్డును కలిగి ఉన్నారని తెలుస్తోంది. అయితే వారిలో 57.25 కోట్లమంది మాత్రమే తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారట.

సుమారు 12 కోట్లకు పైగా పాన్ కార్డులు, ఆధార్‌ కార్డుతో లింక్ అవ్వలేదని, అందుకే ఈ 12 కోట్ల పైచిలుకు పాన్ కార్డులో, 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయట. ఈ విషయం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటకు వెల్లడైంది.

మధ్యప్రదేశ్‌లోని చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి ఈ పాన్ కార్డు ఆధార్ లింక్ విషయమై పూర్తి సమాచారం కొరకు ఆర్.టి.ఐ కి దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఆర్.టి.ఐ వారు చెప్పింది ఏమిటంటే పాన్‌కి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఆధార్ అండ్ పాన్ కార్డ్‌ల లింక్ ఆటోమేటిక్‌గా జరుగుతుందని అన్నారు.

అయితే జూలై 1, 2017న లేదా అంతకు ముందు పాన్ కార్డు పొందిన వ్యక్తులు మాత్రం ఆ రెండిటిని తప్పక లింక్ చేయాలనీ సూచించారు.

ఎందుకంటే అప్పటికి ఈ ఆటోమాటిక్ పాన్ అండ్ ఆధార్ లింక్ లేదు అని వెల్లడించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, జూలై 1, 2017న పాన్ కార్డు కోసం అర్జీ పెట్టుకున్న ప్రతి వ్యక్తి ఆధార్ నెంబర్ పొందుపరచడం తప్పనిసరి అయిందని అన్నారు.

కాబట్టి 2017 జూలై 1 కన్నా ముందు పాన్ కార్డు పొంది ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఆర్.టి.ఐ నొక్కి వక్కాణిస్తోంది

ఈ పాన్, ఆధార్ లింక్ చేయడం నోటిఫైడ్ తేదీకి లేదా అంతకంటే ముందు చేయవలసి ఉంటుంది. దానికోసం తుది గడువుగా 2023 జూన్ నెలను, ఆఖరు నెల గా ప్రకటించారు.

అప్పటిలోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకొని పక్షంలో, పాన్ కార్డు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక వేళ కార్డు డియాక్టీవ్ అయితే గనుక మళ్లి యాక్టీవ్ట్ చేసుకోవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 1000 రూపాయలు జరిమానా వసూలు చేస్తుంది.

Leave a Comment