1200 ఏళ్ళ నాటి సమాధి కాదు బంగారు గని – ఎన్ని కోట్లో ?

WhatsApp Image 2024 03 12 at 2.19.52 PM 1200 ఏళ్ళ నాటి సమాధి కాదు బంగారు గని - ఎన్ని కోట్లో ?

గుప్త నిధుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కొందరు నగలు అని వస్తువు లని దొరుకుతు ఉంటాయి లదా అసలు ఎం ఉండవు. ఇంకొందరు ఉంటారు గనుల కోసం బలి కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే పురాతన కాలం నాటి నాగరికత కు సంబందించి విశేషాలు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి.

ఇప్పుడు అలాంటిదే ఒకటి బయట పడింది. సుమారు 12 శతాబ్ద కాలం నాటి సమాధి తవ్వి చూడగా భారీ మొత్తం లో బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు ఆ బంగారు నిధులు చూసి షాక్‌కి గురయ్యారు. మధ్య అమెరికాలోని పనామా సిటీకి 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్‌ పార్క్‌ వద్ద తవ్వకాలు ప్రారంభించారు శాస్త్రవేత్తలు. మొదట అందరు సమాధి అనుకున్నారు కాని తవ్వుతున్నకొద్దీ బంగారు నిక్షేపాలతో పాటు మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి.

ఇది యూరోపియన్‌ రాకకు ముందు స్థానిక తెగల జీవితాలను అలాగే వారు జీవించిన విధానం గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా ఆ సమాధిలో ఎన్నో రకాల వస్తువులు అంటే , బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో తయారు చేసిన చెవిపోగులు, పలు రకాల విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు అనేక విషయాలు చెప్పారు. ఆ సమాధి లో మొత్తం 32 మృతదేహాల అవశేషాలను గుర్తించామని వారు చెప్పారు.

అన్ని విషయాలు పరిశోధించిన తర్వాత ఆ సమాధి కోకల్‌ సంస్కృతికి చెందిన ప్రభువుది అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నామని శాస్త్రవేత్తలు చెప్పారు.వారి ఆచారం ప్రకారం, ప్రభువు మరణిస్తే 32 మందిని బలిచ్చి ఆ తర్వాత వారికి సంబందించిన విలువైన వస్తువులు, ఆభరణాలు తో పాతి పెట్టి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అయితే బయట పడిన నిధి విలువ ఎంత ఉంటుందని ఇప్పట్లో అంచనా వెయ్యలేమని వారు చెప్పారు. అక్కడ నిధి ని సేకరించ దానికే చాలా రోజులు సమయం పడుతుందని వారు చెప్పారు.

Leave a Comment