ఒక ఉగ్రవాది విడుదల కోసం ఆప్ పార్టీ కి 135 కోట్లు లంచం ఇచ్చాం – ఉగ్రవాది పన్నూన్ సంచనల ప్రకటన

website 6tvnews template 2024 03 27T112414.744 1 ఒక ఉగ్రవాది విడుదల కోసం ఆప్ పార్టీ కి 135 కోట్లు లంచం ఇచ్చాం - ఉగ్రవాది పన్నూన్ సంచనల ప్రకటన

ఖలిస్తాని ఉగ్రావాద సంస్ద నాయకుడు గురు పత్వాంత్ సింగ్ పన్నూన్ ఇటీవల ఒక వీడియో విడుదల చేసాడు. అందులో మేము ఆప్ పార్టీ నాయకుడు కేజ్రివాల్ కు దాదాపు 135 కోట్లు వరకు డబ్బును ముట్టజేప్పామని అందుకు ప్రతి ఫలం గా ఖలిస్తాని ఉగ్రవాది ప్రొఫెసర్ దేవేందర్ పాల్ సింగ్ భుల్లర్ ను విడుదల చేస్తామని తమకు హామీ ఇచ్చారని పన్నూన్ ఆరోపించాడు.అంతే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఆరోపణలు చేసాడు.

కేజ్రివాల్ ఆయన మంత్రి సహచరులు అందరు గొప్పగా మేము నిజాయితీ పరులైన హిందువులమని చెప్పుకుంటారు కాని వారు అలాంటి వారు కాదని అత్యంత అవినీతి పరులు అని అతడు విమర్శించాడు. ఆయన ఒకసారి 2014 లో అమెరికా వచ్చారని అప్పుడు తమ ప్రభుత్వం అధికారం లోకి రాగానే 5 గంటల లోపున ప్రొఫెసర్ దేవేందర్ సింగ్ పాల్ ను విడుదల చేస్తామని తనకి హామీ ఇచ్చినట్లు అతడు చెప్పాడు. అధికారం లోకి వచ్చి 9 సంవత్సరాలు అయిన ఇంతవరకు అతను ఇచ్చిన మాట నిలిబెట్టుకోలేదని ఆరోపించాడు.

అంతే కాదు జైలు లో ఉన్న ఖలిస్తాని సబ్యులకు అన్నివిధాలుగా జాగ్రత్తగా చూసుకుంటానని కూడా మాట ఇచ్చినట్లు అతడు చెప్పాడు. ఖలిస్తాని ప్రజాభిప్రాయం కోసం వివరాల సేకరించడానికి సహకరించేవారి మీద కేసులు ఎందుకు పెట్టినట్లు అని ఆయన విమర్శించాడు. మా వద్ద ఇన్ని కోట్లు తీసుకుని మాకు వెన్నుపోటు పొడుస్తాడు అనుకోలేదు అని ఆయని అన్నారు.

Leave a Comment