Pran Pratishtha ceremony: అయోధ్య(Ayodhya) లో నిర్మించిన రామ మందిర(Rama Mandir) ప్రారంభోత్సవానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎన్నో వందల సంవత్సరాల నిరీక్షణ జనవరి 22వ తేదీ తో ఫలించబోతోంది.
రామమందిరం రాం లల్లా విగ్రహ ప్రతిష్టకి ముందు నుండి నుండి అనేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోనే ఆలయాన్ని విశేషంగా అలంకరించి ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన రామాలయ వీడియోలు ఫోటోలు దేశమంతటా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశాయి.
ఇక రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా విశేష పూజలు చేస్తున్నారు, ఈ వేడుక కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 14 జంటలను ఎంపిక చేశారు. ఈ జంటలు కర్తలుగా వ్యవహరించనున్నారు.
రాజస్థాన్(Rajasthan), అస్సాం(Assam), జైపూర్(Jaipur), పంజాబ్(Panjab), తమిళనాడు(Tamil Nadu), కర్ణాటక(Karnataka), హరియాణా(Haryana), ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రాల నుండి జంటలు వస్తున్నారు. ఇక జనవరి 20వ తేదీన పుష్పాదివస్ నిర్వహించారు.
ఈ క్రతువు కోసం వివిధ రాష్ట్రాల నుండి ప్రత్యేక విమానాలలో పువ్వులు తెప్పించారు.