మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారి చేసారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడం వల్ల ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆయనను జైలుకు పంపింది.
ఈరోజు విచారణ సందర్భంగా, ED తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు మాట్లాడుతూ, సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి రిమాండ్ కోసం అడగడం లేదని అయితే తదుపరి విచారణ కోసం ED ఎప్పుడైనా కస్టడి కి ఇమ్మని కోరుతూ దరఖాస్తు చేయవచ్నిని ఆయన అన్నారు
లాక్ అప్ లో కేజ్రీవాల్ ED అధికారులకు సరిగ్గా సహకరించడం లేదని అని, అంతే కాకుండా అతను అధికారులకు ఇవ్వాలిసిన సమాచారం ఇవ్వకుండా అన్ని ఎగవేత ధోరణి లో సమాధానాలు ఇస్తున్నారని, ED తరపు న్యాయ వాది కోర్టుకు తెలిపారు. ఇంకా చెప్పాలంటే మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి దర్యాప్తును పూర్తి గా తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ముందు భవిష్యత్తులో మాకు కస్టడీ అవసరం పడవచ్చని ఆయన చెప్పారు.