రోజు రోజు కి సాటిలైట్ చానెల్స్ కి పోటీగా OTT లు కొత్త కొత్త గా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి మీద నియత్రణ లేకపోవడం వల్ల అశ్లీలం పెరిగిపోతోంది. దాదాపు అన్ని OTT ల పరిస్థితి ఇలాగే ఉంది. కుటుంబ సబ్యుల తో కుర్చుని చూడాలంటే చాల ఇబ్బంది గా ఉంటోందని కస్టమర్స్ ఆరోపిస్తున్నారు. ఎన్నో సార్లు OTT హెచ్చరించిన వారి లో మార్పు రాలేదు.
చివరకు దాదాపు 18 OTT ఫ్లాట్ ఫాం లతో పాటు 19 వెబ్ సైట్ లు, అలాగే 10 యాప్ లు , 57 సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పటికే తొలగించామని చెప్పింది. ఈ మేరకు సమాచార, ప్రచార శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. రద్దు చేసిన యాప్ లో 7 గూగుల్ ప్లే స్టోర్ ఉన్నవి కాగా , 3 యాపిల్ యాప్ స్టోర్ లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఫేస్ బుక్ లో 12, ఇంస్టా గ్రామ్ లో 17 , యూ ట్యూబ్ లో 12 ఉన్నాయని వాటికి కూడా ఎన్నో సార్లు హెచ్చరించామని సమాచార, ప్రచార శాఖ తెలిపింది. అయితే నిషేధించిన OTT లకు సంబందించి కోటికి పైగా డౌన్ లోడ్ ఉన్నాయని మా ఎంక్వయిరీ లో బయటపడిందని చెప్పారు.
ఇందులో అశ్లీల కంటెంట్ లు సంబందించి పలు ట్రైలర్ లు, సీన్స్, వెబ్ లింక్స్ ని కుడా టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పారు. ప్రతీ OTT ఫ్లాట్ ఫాం కి 32 లక్షల లైక్స్ ఉన్నట్లు తెలిసింది అని చెప్పారు. నిభందనలకు వ్యతిరేకం గా ఎవ్వరు వ్యావహ రించిన వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు అందులో బాగంగానే 18 OTT లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పింది
నిషేధించిన OTT వివరాలు
1.DREAMS FILMS 4.VOOVI 7.YESSMA 10.UNCUT ADDA 13.TRI FLICKS 16.X PRIME
2.NEON X VIP 5.BESHARAMS 8.HUNTERS 11.RABBIT 14.XTRAMOOD 17.NEUFLICKS
3.MOODX 6.MOJFLIX 9.HOT SHOTS VIP 12.FUGI 15.CHIKOOFLIX 18.PRIME PLAY