ప్రస్తుతం తెలంగాణలో 30 ఏళ్లు దాటిన యువత లో బీపీ, షుగర్ ముప్పును చాలా మంది ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చేపట్టిన తాజా సర్వే లో వెల్లడైంది. అసలు 60 ఏళ్లు నిండిన తర్వాత రావాల్సిన అనారోగ్య సమస్యలు 30 ఏళ్ళు వచ్చేసరికి రావడం రాష్ట్రం లో విద్యాది కారులను ఒకింత కలవార పాతుకు గురి చేస్తోందని చెప్పాలి.
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 30 ఏళ్లు దాటిన యువత కి వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (NCD) స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తోంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లు వల్ల ఈ రెండు విషయాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. తెలంగాణ వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ స్క్రీనింగ్ రిపోర్టు లు ప్రకారం చూసినట్లయితే తెలంగాణ యువతలో 12.4% మంది యువత రక్తపోటు తోను,అలాగే 6.6% మంది యువత షుగర్‌తోను బాధపడుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన యువత 1.82 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయని అధికారులు చెప్పారు. 30 ఏళ్లు దాటిన యువత ఎంత మంది ఉన్న వారందరికీ ఎన్‌సీడీ (NCD) స్క్రీనింగ్ టెస్ట్ లు చేసేందుకు హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇంటింటి సర్వే చేపట్టింది.
జనవరి నాటికి 1.51 కోట్ల మందికి వైద్య పరీక్షలు చేయగా అందులో 19.21 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది. 9.98 లక్షల మంది లో షుగర్ వ్యాధి తో బాధపడుతున్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. మెుత్తం యువతలో చూసుకుంటే 19% మంది బీపీ, షుగర్ ఈ రెండు అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారని అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు.
యువత లో ఈ బీపీ, షుగర్ రావడానికి గల కారణాలు
వీరు సమయంతో సంబందం లేకుండా తీవ్రమైన ఒత్తిడిలో పని చేయడం, వేళ కి తినకపోవటం, ఇంట్లో చేసినవి కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం ఇలాంటి కారణాల వల్లనే బీపీ, షుగర్ లు వస్తున్నాయని చెప్పారు. వీటితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు అయిన గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ కేసులు కూడా తెలంగాణా ప్రాంతంలో పెరుగుతున్నాయి అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఒక్కరు తమ జీవన శైలిలో మార్పులు చేసుకొని సమయానికి భోజనం చెయ్యడం తో పాటు తగినంత వ్యాయామం, కంటినిండా నిద్రపోయి నట్లయితే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందొచ్చని డాక్టర్లు చెప్తున్నారు.