2 Lakh Farmer Loans Waiver: 2 లక్షల రైతు రుణ మాఫీ..విత్తనాలు ఎరువుల కొరత ఉండకూడదని ఆదేశం.
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మొదటగా మహాలక్ష్మి పధకం కింద ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన అనంతరం ఆరోగ్యశ్రీ పై దృష్టి సారించారు.
ఆరోగ్యశ్రీలో పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ పరిధిని 10 లక్షలకు పెంచారు. ఒకపక్క ఇవన్నీ చేస్తూనే ప్రతి రోజు ముఖ్య మంత్రి ప్రజలకు కూడా అందుబాటులోనే ఉంటున్నారు.
పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమం లోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో కెలక నిర్ణయం తీసుకుంది, ఎన్నికల హామీ లో భాగంగా చెప్పిన 2లక్షల రూపాయల రైతు రుణ మాఫీని అమలు చేసే విధంగా దృష్టి సారించింది.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయబోతున్నారు అన్న మాట విన్న రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో సీఎం రేవంత్ రైతులకు రుణ మాఫీ చేయడం పై కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతులకు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని చెప్పినట్టుగానే ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా పై కూడా ఉంతస్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా సీఎం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయశాఖ విభాగాల పనితీరు ఎలా ఉండాలి, రైతు సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేయాలి అనే విషయాలపై ముఖ్య మంత్రి, మంత్రులు అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఇక రెండు లక్షల రూపాయల రైతు రుణ మాఫీ అనేది అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి ఏటా 15 వేళా రూపాయలు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. దీనిని కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలనీ యోచిస్తోంది.
అందుకు కారణం కూడా లేకపోలేదు, తెలంగాణ లో రైతులు యాసంగి పంట పండించాలని చూస్తున్నారు. ఈ పంట పండించే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా మొత్తాన్ని అందించే అవకాశం ఉంటుందో లేదో అన్న మీమాంశ ఉండటం వల్ల ప్రస్తుత సాయం కింద 5 వేల రూపాయలు అందించాలని భావిస్తోంది.
ఈ మొత్తం రైతులకు పంట పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది కాబట్టి ఆమొత్తాన్ని వెన్తనె విడుదల చేయాలనీ అధికారులను సీఎం ఆదేశించారు.
మరీ ముఖ్యంగా రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ముఖ్యమైన విత్తనాలు ఎరువుల విషయంలో ఎలాంటి కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులకు చెప్పారు.
గతంలో ఉన్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు పధకాన్ని అమలు చేసింది. అయితే ఆ పధకంలో 5 ఎకరాలు లోపు, అలాగే 10 ఎకరాలు లోపు ఉన్న రైతులకు రైతుబంధు పధకం డబ్బు ఎలా అందిచారో తనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలని అధికారులను కోరారు.
తెలంగాణ లో పంట వేస్తున్న రైతులకు నీటి కొరత లేకుండా చూడటం కూడా ప్రధానమైన అంశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉటుందని ఇది రైతు ప్రభుత్వమని వారు పురుద్ఘాటించారు.
ఇక సీఎం ఆదేశాల మేరకు అధికారులు రైతుబంధు పధకం కింద నిధులను విడుదల చేయడం మొదలు పెట్టేశారు. సుమారు 70 లక్షల మంది రైతన్నలకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల మేర నగదు పంపిణి చేయడం జరుగుతున్నట్టు తెలుస్తోంది.