అప్పుడే నగరంలో భానుడి ప్రతాపం – ఈ సారి సమ్మర్ లో చుక్కలే : 2024 Hyderabad likely to face hotter summer this year

website 6tvnews template 11 1 అప్పుడే నగరంలో భానుడి ప్రతాపం - ఈ సారి సమ్మర్ లో చుక్కలే : 2024 Hyderabad likely to face hotter summer this year

2024 Hyderabad likely to face hotter summer this year : అప్పుడే నగరంలో భానుడి ప్రతాపం – ఈ సారి సమ్మర్ లో చుక్కలే తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఎండల తీవ్రత చాల ఎక్కువగా ఉంది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

దీని వల్ల ఉక్క పోత ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైయ్యాయి. దీని తీవ్రత రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముందని కూడా చెబుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు ఇక రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని కుడా వాతావరణ శాఖ హెచ్చరించింది.

తర్వాత మళ్లీ ఐదారు రోజులు చల్లబడి మళ్లీ వాతావరణం వేడెక్కుంతుందని చెప్పింది.నిన్న ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరువ కావడంతో ప్రజలు కూడా రోడ్ల మీదకు రావడానికి భయపడ్డారు. రెండు రోజులు గా రాత్రి వేళ ఉక్కపోత కూడా ఉంటోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ మాత్రమే చల్లని గాలులు వీస్తున్నాయి.

తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫ్యాన్‌లు, ఏసీల వాడకం కూడా ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగింది. హైదరాబాద్ లో నిన్న 38.4 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో ఈ రకమైన వాతావరణం ఉందని నగర ప్రజలు అనుకోవడం కనిపించిది.

ఈ నెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసింది.

Leave a Comment