2024 Republic Day Guest: భారత్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా వచ్చేది ఈయనే.
భారత్ లో జరగబోయే Republic Day ఈ సారి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బైడన్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ, భతదేశంలో జరగబోయే ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
జనవరి 26న జరిగే ఈ Republic Day వేడుకలకు రావాలని కేంద్ర ప్రభుత్వం Emmanuel Macron ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను జనవరి 26 వేడుకలకు ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు.
కానీ, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న బైడెన్ తాను రాలేనని తెలపటంతో ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
ఈ సంవత్సరం జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ Republic Day బాస్టిల్ డే పరేడ్ కు భరత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే, సెప్టెంబరులో దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో కూడా ఫ్రెంచ్ అధినేత Macron పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా ప్రధాని మోదీతో చర్చలు జరిగాయి కూడా జరిగాయి. ఈ అంశం స్వయంగా ఫ్రాన్స్
అధ్యక్షుడు Macron లిపారు. ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌కు మోదీ హాజరుకావడాన్ని ఒక గొప్ప గౌరవంగా తమ దేశ Macron ప్రజలు భావించినట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు భారతదేశంలో ఉత్పత్తి రూపకల్పన ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ప్రధాని మోదీ జీ 20 సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు.అలాగే, డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్‌మ్యాప్‌ను కూడా వీలైనంత త్వరగా ఖరారు చేయాలని పిలుపునిచ్చారు.
భారత్ Republic Day ఫ్రాన్స్ నేతలు ఇలా ముఖ్య అతిథులుగా హాజరుకావడం ఇది ఆరో సారి.ముందు 1976, 1998లో ఆ దేశ ప్రధాని జాక్వెస్ చిరాక్ Republic Day సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు.
1980లో మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి’ఎస్టేయింగ్, 2008లో మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజీ, 2016లో మాజీ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండ్ భరతదేశ గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.
కాగా, 2023 Republic Day వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024 లో జరగ బోయే Republic Day వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ Macron హాజరు కానున్నారు.