దేశంలోనే ఫస్ట్ టైం ఎంటర్ర్ప్రైజ్ ఫోకస్డ్ Samsung Galaxy XCover 7 స్మార్ట్ ఫోన్ – వీరికి మాత్రమే.

website 6tvnews template 32 దేశంలోనే ఫస్ట్ టైం ఎంటర్ర్ప్రైజ్ ఫోకస్డ్ Samsung Galaxy XCover 7 స్మార్ట్ ఫోన్ - వీరికి మాత్రమే.

2024 Samsung Galaxy XCover 7 Smart Phone : సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్, తమ సరికొత్త రగ్డ్ Samsung Galaxy XCover 7 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ నుంచి వస్తున్న దేశంలోనే మొదటి ఎంటర్ర్ప్రైజ్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.

గత నెలలో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల చేసింది.ఇక ఈ Samsung Galaxy XCover 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది .

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ. 27,209 లుగాను, అలాగే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ధర రూ. 27,530 గా ధరని నిర్ణయించింది.

కార్పొరేట్ కస్టమర్స్, ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ అయిన samsung.com, ఆన్ లైన్ ఈపీపీ పోర్టల్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటన వుడుదల చేసింది.

galaxy xcover 7 1704883567571 దేశంలోనే ఫస్ట్ టైం ఎంటర్ర్ప్రైజ్ ఫోకస్డ్ Samsung Galaxy XCover 7 స్మార్ట్ ఫోన్ - వీరికి మాత్రమే.

Samsung Galaxy XCover 7 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ పై నాక్స్ సూట్ కి సంబంధించిన 12 నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా కంపెనీ అందిస్తోంది. మరొకవైపు స్టాండర్డ్ ఎడిషన్ కు ఒక సంవత్సరం వారెంటీ ఇస్తోంది. అలాగే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కు రెండు సంవత్సరాల వారెంటీ ని ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Samsung Galaxy XCover 7 స్పెసిఫికేషన్స్ ను చూసినట్లయితే

 • 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ ప్లే
 • 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
 • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం ఇవ్వడం జరిగింది
 • మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ని అమర్చారు.
 • 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది
 • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్,
 • వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది
 • ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు
 • ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కుడా ఉంది
 • 4050 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది
 • 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Leave a Comment