కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ లోక్ సభ లో మధ్యంతర బడ్జెట్ పై ప్రసంగిస్తూ ఒక కీలక పధకం గురించి చెప్పడం జరిగింది. అదే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పధకం, ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పై సోలార్ పానెల్స్ ఇళ్ళపై ఏర్పాటు చెయ్యడం, దీని ద్వార కరెంట్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించ వచ్చని ప్రకటించింది ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి గృహాలకు సోలార్ పానెల్స్ ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించింది, ఈ పదకం ద్వారా గృహ యజమానులు నెలకు 300 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపింది.ఇందుకోసం ఈ పదకానికి 7,327 కోట్లు కేతాయిస్తునట్లు ప్రకటించింది.
BENEFITS
ఈ పధకం లో చేరిన గృహ యజమానులు వారు తమ ఇళ్ళపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయిన తరువాత వారు ఇళ్ళ అవసరాలకు కోసం విద్యుత్ వాడు కోవడం జరుగుతుంది , వారు వాడుకున్న తర్వాత కొంత విద్యుత్ మిగులుతుంది, ఆ మిగిలిన విద్యుత్ ని వారు డిస్కం లకు అమ్ముకోవచ్చు, దీని ద్వార వారు సంవత్సరానికి 15 వేల నుండి 18 వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
DOCUMENTS
అయితే ఈ పధకం లో చేరగోరే ఇళ్ళ యజమానులు వారు కేంద్ర పభుత్వం ద్వార కాని లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వార కాని జారి చేయబడిన గుర్తింపు కార్డులు , అనగా ఆధార్ కార్డ్, అడ్రెస్స్ ప్రూఫ్, ఐడెంటిటి కార్డు, ఫ్యామిలీ రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్, ముబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, విద్యుత్ బిల్లు సంబందించిన డాక్యుమెంట్స్ అన్ని వారి వద్ద ఉండాలి
HOW TO APPLY
ఈ పధకం లో చేరగోరే ఇళ్ళ యజమానులు solarrooftop.gov.in లో లాగిన్ అయ్యి వారి వివరాలతో దరఖాస్తు
చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లో ఎడమవైపు Apply For Rooftop Solar అనే దానిపై క్లిక్ చేయాలి. ఇందులో రాష్ట్రం పేరు, జిల్లా , పవర్ కంపెనీ వివరాలు, వినియోగదారు అకౌంట్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. ఇందులో అవసరమైన పత్రాలన్నీ అప్లోడ్ చెయ్యాలి. అప్లోడ్ అనంతరం సబ్‌మిట్ చెయ్యాలి.
PROCESS
ఈ విధం గా రిజిస్టర్ అయ్యాక తమ మొబైల్ నెంబర్ ఉపయోగించి, solarrooftop.gov.in అనే వెబ్ సైట్ లోకి
లాగిన్ తమ వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రిజిస్టర్ అయిన ఇళ్ళ యజమానులు సోలార్ పానెల్స్
ఇళ్ళపై వేయిన్చుకున్న వారికి కేంద్రం ద్వారా 30 నుండి 70 శాతం వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సబ్సిడీ అనేది ఆయా రాష్ట్రాల వారి గా వేర్వేరు గా ఉంటుంది.
అప్లికేషను సబ్‌మిట్ చేసిన 15 రోజుల నుండి 20 రోజుల్లో అన్ని వివరాలు పరిశీలించి, అర్హత ఉన్న వారికి సోలార్ పానెల్స్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ పధకానికి ఎవరు అర్హులు అనేది కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది