తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) భారతీయ రాష్ట్ర సమితి పార్టీని(Bharatiya Rashtra Samiti) చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిశారు.
ఈ విషయం తెలిసిన వారంతా ముందు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే జంపింగ్స్ మొదలయ్యాయా అని అనుకుంటున్నారు.
అయితే సదరు ఎమ్యెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది పార్టీ మారేందుకు కాదట. కేవలం వారి నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని పనుల నిమిత్తం కలిసారుట. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని అంటున్నారు.
అసలు ఇంతకీ రేవంత్ రెడ్డిని కలిసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి(Sunita Lakshma Reddy), జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు(Manik Ravu), దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy), పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) ఉన్నారు. వీరంతా కూడా మెదక్ జిల్లాకి చెందిన ఏ,ఎల్యేలు కావడం విశేషం. అయితే వీరిది కేవలం మర్యాద పూర్వక భేటీ అని అంటున్నారు.