7.5Cr Rich Beggar in Mumbai: ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా..ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.

Do you know how rich this beggar is

ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా.. ముంబై లో ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు..అతని పిల్లలు ఏంచేస్తారంటే.

చక్రవర్తికి వీధి బిచ్చగత్తె కి బంధు వవుతానని అంది మని మని, ఏంటి మని సినిమా లోని పాట గురించి చేబుతున్నాను అనుకుంటున్నారా, మరేం లేదండీ డబ్బు అందరికి అవసరమైన వస్తువు, ఎక్స్ పైరీ లేని వస్తువు, ఈ డబ్బు ఎవరినైనా ఓవర్ నైట్ లో రోడ్డున పడేయగలడు, అదే ఓవర్ నైట్ లో కోటీశ్వరుడిని చెయ్యగలడు.

నమ్మకంగా లేదా అయితే చరిత్ర తిరగేసి చూడండి, ధర్మ రాజు, శకునితో పాచికలాడి రాజ్యాన్ని, అన్నదమ్ములను చివరికి భార్యను కూడా కోల్పోయాడు.

ఇది కేవలం ఒక రోజులో జరిగిందే. అయితే ఒక్క రోజులో లక్షాధి కారులు కోటీశ్వరులు అయినా వారు ఈ కలియిగంలో మన కళ్ళ ముందే ఉన్నారు. లాటరీ పుణ్యమా అని అనేకమంది ఆగర్భ శ్రీమంతులయ్యారు.

లాటరీలు విషయం కాస్త పక్కన పెట్టి మనం ఒక బిచ్చగాడి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే, ఇతగాడు యాచన వృత్తి చేస్తూనే కోటీశ్వరుడయ్యాడు.

ప్రపంచం లో యాచన వృత్తిలో ఉన్న వారందరిలోకెల్లా ఇతగాడే అత్యంత ధనవంతుడు. పైగా ఆ బిచ్చగాడు ఎక్కడో లేడు మన భారతదేశంలోనే ముంబై మహానగరంలోనే ఉన్నాడు.

అయితే అతడు కోటీశ్వరుడెలా అయ్యాడు, అతనికి ఇది ఎలా సాధ్యపడింది అని వివరాలు తెలుసుకుందాం.

he source of money is this world:

Untitled design 14 7.5Cr Rich Beggar in Mumbai: ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా..ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.


ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు అన్నిటికి మూలం కాబట్టి డబ్బును తప్పకుండా గౌరవించాలి. లక్ష్మి దేవిని పణంగా పెట్టి పాచికలు, పరాచికాలు ఆడకూడదు, అలా చేస్తే రోడ్డున పడటం ఖాయమే.

అయితే అదే డబ్బును పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటే గనుక అట్టడుగు స్థాయిలో ఉన్నవారు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ బిచ్చగాడు కూడా అలానే చేశాడు.

ముంబై కి చెందిన భరత్ జైన్ అనే వ్యక్తి ముప్ఫై ఐదేళ్ల క్రితం దిక్కుతోచని స్థితిలో యాచన వృత్తిని ఎంచుకున్నాడు. భరత్ జైన్ భిక్షాటన చేసే ప్రదేశాలు ముంబై లో చాలా రద్దీ గా ఉండే ప్రదేశాలు, అవే ఛత్రపతి శివాజీ టర్మినల్, రెండవది ఆజాద్ మైదాన్.

ఈ రెండు ప్రాంతాలకు ప్రతి రోజు అనేక మంది వాస్తు వెళుతూ ఉంటారు. చిత్రపతి శివాజీ టర్మినల్ పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్ కి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చి పోతు ఉంటారు.

అలంటి ప్రదేశంలో యాచన చేయడం వల్ల బిచ్చగాళ్ళకి చేతి నిండా డబ్బు వస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు స్టేషన్ వద్ద కూర్చున్నా నిలబడినా జేబు నిండా చిల్లర రావడం ఖాయం.

రెండవది ఆజాద్ మైదాన్ ఇక్కడ కూడా ప్రజల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆజాద్ మైదాన్ లో క్రికెట్ మ్యాచులు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది చిత్రపతి శివాజీ టర్మినల్ కు చేరువగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా యాచకులకు మంచి అనుకూలమైన స్థలం గానే చెప్పబడుతుంది.

The same profession for thirty years:

Add a heading 2023 11 28T122520.774 7.5Cr Rich Beggar in Mumbai: ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా..ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.

వత్సరాలుగా ఈ ప్రదేశాలను యాచన కోసం ఎంచుకున్నాడు. చదువు లేకపోవడం, ఆదరించేవారు లేకపోవడం తో ఈ యాచన వృత్తిలోకి దిగాడు భరత్ జైన్, అయితే భావిద్యత్తుపై తనకు ఎన్నో ఆశలు ఉన్నాయి.

యాచన వృత్తి చేసినప్పటికీ ఫ్యూచర్ మీద గట్టిగానే దృష్టి పెట్టాడు. అందుకే భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బు నుండి పొదుపు చేయడం మొదలు పెట్టాడు.

దుబారా ఖర్చులకు పోకుండా, సేవింగ్స్ పై ఫోకస్ పెట్టాడు. మొదటి నుండి బాగా రద్దీ గా ఉండే చోట యాచన చేయడం వల్ల అతనికి ప్రతి రోజు డబ్బు కూడా ఎక్కువగా వస్తు ఉండేది.

కేవలం యాచన చేస్తూ అతడు నెలకి డెబ్భై వేలకుపైనే ఆర్జిస్తున్నాడు. ఈ డబ్బును దుబారా చేయకుండా, జాగ్రత్త పడటంతో ముంబై లోని ఖరీదైన ప్రాంతం బాంద్రా లో అపార్ట్మెంట్ల లో రెండు ఫ్లాట్స్ కొనగలిగాడు.

భిక్షాటన చేస్తూ దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు కూడబెట్టాడు. ఇది కాకుండా ఠానే లో రెండు షాపులు ఉన్నాయి. అయితే భరత్ జైన్ వాటిని అద్దెకు ఇచ్చేశాడు. వాటి నుండి అతనికి రెంట్ల రూపంలో లక్షకి పైనే ముడుతుంది.

Houses in Bandra, Shops in Thane:

Add a heading 2023 11 28T121803.882 7.5Cr Rich Beggar in Mumbai: ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా..ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.


ఇక బాంద్రా విషయానికే వస్తే ఇక్కడ పెద్ద పెద్ద సినీ తారలు ఉంటారు. ఆగర్భ శ్రీమంతులు, కోట్లకి పడలెత్తిన వారు, బడా బడా ఇండస్ట్రీలిస్టులు మాత్రమే ఉంటారు.

సదా సీదా మధ్యతరగతి వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉండటం అసాధ్యమనే చెప్పాలి. అలంటి రిచ్ ఏరియాలో భరత్ జైన్ ఇల్లు కొనగలిగాడంటే అది సామాన్యమైన విషయం కాదు.

కేవలం యాచన ద్వారా వచ్చిన డబ్బు తోనే కదా కొన్నది, కష్టపడి చెమటోడ్చి కొన్నాడా, లేదంటే లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసి కోట్లు గడించి కొన్నాడా అని తేలికగా తీసి పారేయనక్కర్లేదు.

ఈ ఆస్తులను అతడు భిక్షాటన తోనే కొన్నప్పటికీ, అతను ఎంచుకున్నది యాచన వృత్తినే అయిన్నప్పటికీ అతడు భవిష్యత్తుమీద పెట్టుకున్న ఆశల గురించి చెప్పుకోవచ్చు.

ఒక వేళ ఏ పరిస్థితిలో అయినా యాచన వృత్తి ఆపేయాల్సి వస్తే కూడు గుడ్డ నీడకు ఢోకా ఉండ కూడదు అనే ఉద్దేశంతోనే పొదుపు అనే మంత్రాన్ని జపించాడు. అలా చేశాడు కాబట్టే ఈ రోజు అతని బిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదువుకుంటున్నారు.

ఇవన్నీ చెప్పడాన్ని బట్టి చుస్తే యాచక వృత్తిని ప్రోత్సహిస్తున్నట్టుగా తీసుకొనవసరం లేదు, ఏ వృత్తిలో ఉన్నా పొదుపు అనే మంత్రాన్ని తప్పక జపించాలి అని.

మనం సంపాదిస్తున్న దానిలో ఎంతో కొంత మనది కాదనుకుని భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెడితే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారు పెద్దలు.

భరత్ జైన్ ఇప్పటికి యాచన వృత్తిలోనే ఉన్నప్పటికీ తన బిడ్డలను కార్పొరేట్ స్కూళ్ల లో చదివించడానికి కారణం ఆ వృత్తి తనతోనే ఆగాలని, తన బిడ్డలు కష్టపడి చదువుకుని మంచి గౌరవప్రదమైన ఉద్యోగం పొందాలని అతని ఉద్దేశంగా మనం చూడొచ్చు.

యాచన చేయడం ద్వారా తేలికగా డబ్బు వస్తోంది అనుకుంటే, అది అంత గౌరవప్రదమైన వృత్తే అయితే భారత జైన్ తన పిల్లలను కూడా ఇదే వృత్తిలోకి దించేవాడు కదా, తాను ఛత్రపతి శివాజీ టర్మినల్, ఆజాద్ మైదాన్ చేసుకున్నట్టు,

ముంబైలోని మరికొన్ని రద్దీ ప్రదేశాలను తన బిడ్డలకు చూపెట్టి యాచన చేయమని వాడు కదా, కానీ అతడు అలా చేయలేదు. చక్కగా తన బిడ్డలను విద్యావంతులను చేస్తున్నాడు.

Leave a Comment