JNTU HYDERABAD: B. Tech విద్యార్థులకి 75% క్రెడిట్ పాయింట్లు తగ్గింపు.
10వ తరగతి, ఇంటర్మీడియేట్ లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కూడా, ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తరువాత మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు.
కొన్ని వందల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు సబ్జెక్టులు పాస్ అవలేక సతమతం అవుతున్నారు.
JNTU నిర్ణయం :
విద్యార్థుల అవస్థలు గమనించిన JNTU హైదరాబాద్, అలా పాస్ అవలేకపోయిన విధ్యార్థులను, రెండవసంవత్సరం వెళ్లేందుకు వీలుగాఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది.
మొదటి ఏడాదిలో అకడమిక్ క్రెడిట్స్ పూర్తిగా 75 % తగ్గిస్తూన్నట్టు తెలిపింది.
OSMANIA నిర్ణయం :
ఈ విధ్యాసంవత్సరానికి ఈ క్రెడిట్స్ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది OSMANIA UNIVERSITY.
కానీ ఇలా క్రెడిట్స్ తగ్గింపు, తొలగింపు వల్ల ఈ సారికి వెళ్ళిపోయిన విధ్యార్థులు, తర్వాతి ఏడాది వారికి ఒత్తిడి మరింత పెరుగుతుందని అన్నారు నిపుణులు.
క్రెడిట్స్ తగ్గింపు వెనకాల కారణాలు :
విభిన్న నేపథ్యల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించడం.గ్రామీణ ప్రాంతాలలో తెలుగు మద్యమంలో చదువుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ENGLISHలో చదవలన్నా కస్టమే, అలాంటి వారి కోసం ఈ నిర్ణయం.
యూనివర్సిటీలలో నిష్ణాతులైన అధ్యాపకులు లేకపోవడం.నగర వాతావరణానికి, గ్రామీణ విద్యార్థులు అలవాటు పడలేకపోవడం.