75th Republic Day celebrations : గణతంత్ర దినోత్సవ వేడుకలు : భారతదేశం మొత్తం మువ్వన్నెల జెండాతో ముస్తాబైంది. దేశవ్యాప్తంగా 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
దేశభక్తి గీతాలతో, వందేమాతర నినాదాలతో భారతదేశం ఊగిపోతుంది. ఈ ప్రతిష్టాత్మక రోజున రాజ్యాంగ పితామహుడైన డా. బిఆర్ అంబేద్కర్ ని మననం చేసుకుంటున్నారు.
ప్రత్యేక అతిథి :
ప్రతీ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇతర దేశాల ప్రత్యేక ప్రతినిథులు అతిథిగా హాజరవడం పరిపాటి.
ఈ నేపథ్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మాక్రాన్ హాజరయ్యారు.
భారత ప్రధాని నరేంద్ర మోడి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
శుభాకాంక్షలు :
‘‘నా ప్రియ నేస్తం నరేంద్ర మోదీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం!’’ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ” ఎక్స్ ” వేదికగా తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోడి కూడా ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు.
జై హింద్!’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కీలక నిర్ణయం :
ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోడి, ఫ్రాన్స్ అధ్యక్షుడితో కీలకమైన చర్చలు జరపనున్నట్టు సమాచారం.
ఇప్పటికే విధ్యార్థుల విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు.
భారతదేశంతో ధృఢమైన విధ్యా సంబంధాలను ఏర్పరచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేడు వారికి జరిగే సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం.