హైదరాబాద్ లో ఒక ఘరానా మోసం బయట పడింది. అది చేసింది ఎవరో కాదు GHMC ఉద్యోగులు, వీరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ లు గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు చేస్తున్న మోసం ఒకటి బయట పడింది. ప్రతీ నెల పారిశుధ్య పనులు చేసే వారికి వీరే జీతాలు ఇవ్వడం చేస్తారు. అందుకు వీళ్ళ దగ్గర ఒక వేలుముద్ర వేసే మెషీన్ ఉంటుంది. ‘
అందులో ఈ పారిశుధ్య పనులు చేసే వారి వేలు అందులో పెడితే ఆరోజు పని చేసినట్లు అవుతుంది. వారు ఏ రోజు రాక పోతే ఆ రోజు డబ్బులు మినహాయించుకుని మిగలిన డబ్బులు ఇస్తారు. ఇక్కడే ఒక ఆలోచన వచ్చింది. ఏరోజు ఈ పని వాళ్ళు రారో ఆరోజు వారు పని చేసినట్లు గా వేలు ముద్ర వేసి ఆరోజు పైసలు వాళ్ళు తీసుకుంటున్నారు. GHMC వారు ఇచ్చిన బయోమెట్రిక్ మెషీన్ లను తమ తెలివి తేటలు ఉపయోగించి డబ్బులు కొట్టేసే వారు.
అయితే వారు ఎన్ని ప్లాన్ లు వేసిన అది సాద్యం కాకపోయేసరికి ఇక వారి ఆలోచన సోషల్ మీడియా లో యు ట్యూబ్ మీద కన్ను పడింది. అందులో ఎలా నకిలీ వేలు ముద్రలు తీసుకోవాలో అలాంటి వాటికి సంబందించిన అన్ని విడియోలు చూసి తమ మెదడు కు పని కల్పించారు శివయ్య ఉమేష్, శివరాం. ఈ వీడియో లో అన్ని విషయాలు తెలుసుకున్నారు.
అలా చూసి మొదట 35 మంది పారిశుధ్య కార్మికుల మీద ప్రయోగం చేసారు. దీనికి వారు చేసింది కొవ్వొత్తి మైనం మీద ఆ కార్మికుల వేలుముద్రలు తీసుకున్నారు, అనంతరం వేరు ఎంసీల్,ఫెవికాల్, వ్యాక్స్ వీటిని వాడి సింధటిక్ వేలిముద్రలు తీసుకున్నారు.
ఇలా దాదాపు అందరి వెలి ముద్రలు సేకరించారు. ఇలా సేకరించిన నకిలీ వేలుముద్రలు తో దాదాపు 86 లక్షలు కాజేశారు. వచ్చిన దాంట్లో ఇద్దరు చేరి సగం తీసుకునేవారు. అయితే పనికి రాకపోయినా వారికి బయోమెట్రిక్ ద్వార పనికి వచ్చినట్లు చూపించే వారు. అయితే వీరి మీద అధికారులు కి అనుమానం వచ్చి నిఘా పెట్టడం తో దొరికిపోయారు.అంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.