అకస్మాత్తు గా కూలిపోయిన ఉత్తరప్రదేశ్‌ నిర్మాణంలో వంతెన !

website 6tvnews template 2024 03 30T144603.237 అకస్మాత్తు గా కూలిపోయిన ఉత్తరప్రదేశ్‌ నిర్మాణంలో వంతెన !

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలోని గత రాత్రి గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. సంఘటన జరిగే సమయం లో ఎవ్వరు లేకపోవడం తో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు.

అయితే అకస్మాత్తుగా సంభవించిన తుపాను కారణం గా నిర్మాణం జరుగుతున్న వంతెన రెండు బీములు పట్టు సడలి పోవడం తోనే ఇలా కూలిపోయి ఉంటుందని అనుకుంటున్నామని అధికారులు చెప్పారు. ఎందుకు కూలిపోయిందనే విషయం తెలుకునేందుకు ఒక కమిటీ వేశామని కమిటీ నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Leave a Comment