Big Relief for bank customers: సాధారణంగా మన బ్యాంకు ఖాతాలో(Bank Account) ఎంతో కొంత నగదు బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటాం, ఎందుకంటే బ్యాంకు ఖాతాలో నిర్దిష్ట మొత్తంలో డబ్బు నిల్వ లేకపోతే పెనాలిటీ పడుతుంది కాబట్టి.
మన బ్యాంకు ఖాతాలో మనకి ఇష్టం ఉంటె డబ్బు ఉంచిపెట్టుకుంటాం, లేదంటే మొత్తం విత్ డ్రా చేసుకుంటాం, మరి దానికోసం పెనాలిటీ ఎందుకు వేయాలి అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి,
ఆ నిబంధనల మేరకే జీరో బ్యాలెన్స్(Zero Balance) ఉన్న ఖాతాలకు పెనాలిటీ వడ్డన తప్పదు అనేవి అనేక బ్యాంకులు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతాదారులు వారి వద్ద నిల్వ ఉంచేంత డబ్బు లేకపోవడంమో లేక,
వారికి బ్యాంకుకి వెళ్లే తీరిక లేకపోవడం వల్లనో వారి అకౌంట్ లో అమౌంట్ మైంటైన్ చేయలేకపోతు ఉంటారు. ఇలాంటి వారు పెనాలిటీ కట్టి మరీ అకౌంట్ ను వాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే రాబోయే కాలంలో బ్యాంకు ఖాతాదారులకు ఈ బెడద నుండి విముక్తి కలగనుంది. ఇక మీదట కొన్ని తరహా బ్యాంకు ఖాతాలకు పెనాలిటీ అనేది విధించొద్దని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (Reserve Bank Of India)ఒక ప్రకటన చేసింది.
ఆ తరహా అకౌంట్లకి ఫైన్ వద్దు – No Penalty For Those Accounts
అసలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) ఏమని చెప్పిందో ఒక్కసారి చూద్దాం, గడిచిన రెండు సంవత్సరాలలుగా బ్యాంకు ఖాతా నిర్వహించకపోయినా,
బ్యాంకు ఖాతాలో నగదు అస్సలు లేకుండా జీరో బ్యాలెన్స్(Zero Balance) ఉన్నా, అటువంటి ఖాతాదారులకు ఎటువంటి పెనాలిటీ విధించవద్దని రిజర్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది.
మరీ ముఖ్యంగా విద్యార్థులు స్కాలర్ షిప్(Student Scholarship) నగదు కోసం తెరిచిన బ్యాంకు అకౌంట్ లు, అలాగే ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ ఫలాలను(Well Fare Schemes) పొందడం కోసం తెరిచే
బ్యాంకు ఖాతాలలో ఎటువంటి లావాదేవీలు జరగకపోయినా పెనాలిటీలు విధించవద్దని చెప్పింది. ఆర్బీఐ వెలువరించిన ఈ వార్త తో లక్షలాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమ చేతిలో డబ్బులు ఉన్న లేకపోయినా, బ్యాంకు అకౌంట్ మైంటైన్ చేసేందుకు నానా తిప్పలు పడి బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత డబ్బు నిల్వ పెట్టిన వారు అనేక మంది ఉన్నారు.
అటువంటి వారికి ఈ నిర్ణయం ఊరట కల్పిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు ఏప్రియల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానున్నాయట.