హైదరాబాద్ నగర ప్రజలకు శ్రీ శైల మల్లన్న దర్శనం మరింత సౌకర్యం – C.M. రేవెంత్ : A.C.Busses Hyderabad to Sri Sailam Temple.

website 6tvnews template 38 హైదరాబాద్ నగర ప్రజలకు శ్రీ శైల మల్లన్న దర్శనం మరింత సౌకర్యం - C.M. రేవెంత్ : A.C.Busses Hyderabad to Sri Sailam Temple.

A.C.Busses Hyderabad to Sri Sailam Temple : రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం లోనే ప్రసిద్ధ స్వయంభు పుణ్య క్షేత్రాలలో ముఖ్యమైన క్షత్రం శ్రీశైలం ఒకటి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి తమ మొక్కులు తీర్చుకుంటారు.

ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్ళే భక్తులకోసం టిఎస్ ఆర్టిసి మంచి శుభవార్త తెలిపింది. ఈ మార్గం లో ఇంత వరకు మామూలు బస్ లు తప్ప ఏసి బస్సులు లేవు, దీనితో కొంత మంది ప్రయాణికులుకి అసౌకర్యం గా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్భంది తీరిపోయిందనే చెప్పాలి.

శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులకోసం టిఎస్ ఆర్టిసి 85 కొత్త బస్ లని నడపాలని నిర్ణయించింది. ఇందులో 75 బస్సు లు ఎక్స్ ప్రెస్ వి కాగా , 10 బస్సు లు ఏసీ బస్సు లు ఉంటాయి.

TSRTC హైదరాబాద్ నగర ప్రజలకు శ్రీ శైల మల్లన్న దర్శనం మరింత సౌకర్యం - C.M. రేవెంత్ : A.C.Busses Hyderabad to Sri Sailam Temple.

ఈ ఏసీ బస్సు లను ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో C.M. రేవెంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభం కానున్నాయి. ఇన్ని రోజులు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే భక్తులు ఏసీ బస్సులు లేకపోవడం వల్ల వారి సొంత వాహనాలలోనో లేదా అద్దె వాహనాలలోనో శ్రీశైలానికి చేరుకునేవారు.

అయితే ఈ వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకుని ఏసీ బస్సు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయాణికులకు చాల సౌకర్యం గా ఉంటుంది. అయితే “రాజధాని ” బస్సు లు పొడవు గా ఉండడం వల్ల ఘాట్ రోడ్డు ఉన్న చోట మలుపులు తిరగడానికి చాల కష్టపడాల్సి వచ్చేది.

ఈ సమస్య వల్ల కొన్నాళ్ళ గా సూపర్ లగ్జరీ బస్సులలోనే ప్రయాణించేవారు. టి ఎస్ ఆర్టిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ కష్టాలనుండి ప్రయాణికులకు ఉపసమనం చేకూరినట్లు అయ్యింది

Leave a Comment