RCB in IPL playoffs: రాయల్ ఛాలంజెర్స్ బెంగుళూరు.. ఐపీఎల్(IPL) ను ఇష్టంగా చూసేవారిలో ఎక్కువశాతం మందికి ఈ జట్టు ఫెవరెట్ జట్టుగా ఉంటుందేమో, ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే ఇది చాలా పాపులారిటీ సంపాదించుకున్న జట్టు.
అయితే ఇంత పాలుపారిటీ ఉంది ప్రయోజనం ఏముంది ? విజయాల శతం తక్కువగా ఉంది, ఈ జట్టుకి ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis)కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మాట ఇటుంచితే ఇప్పటివరకు ఈ జట్టు 27 మ్యాచులు అడ్డాగా కేవలం 14 మ్యాచుల్లో మాత్రమే విజయాన్ని సాధించి, 13 మ్యాచుల్లో ఓటమిని చవిచూడక తప్పలేదు.
పైగా ఈ జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడానికి 16 సీజన్ల నుండి ట్రై చేస్తూనే ఉంది కానీ, అది నిజరూపం దాల్చింది మాత్రమే లేదు. ఐపీఎల్ ట్రోఫీని కైవశం చేసుకుని ముద్దాడాలన్న కల కల్లగానే ఉండిపోతోంది.
పైగా గత సీజన్ లో అయితే మరీ దారుణమైన పేలవమైన ప్రదర్శన ఇచ్చారు. 14 మ్యాచులు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Chalengers Banglore)కేవలం 7 మ్యాచులు మాత్రమే గెలుచుకుంది.
కెప్టెన్సీ మార్పు తప్పదా : Captaincy May Change.
వీటన్నిటిని బట్టి చూస్తుంటే రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ మార్పు అనివార్యమేమో అనిపించక మానడం లేదు. అందుకు బలమైన కారణం కూడా ఉంది, ఆర్.సి.బి(RCB) తన సొంత గడ్డ బెంగుళూరు(Banglore) వేదికగా ఆడిన ఏడింటిలో నాలుగు మాత్రమే గెలుచుకుంది.
దీనిని ఆజట్టు యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. పైగా ఒక దశలో ఆర్సీబి జట్టు కేవలం లీగ్ దశలోనే నిష్క్రమించడం కూడా ఆలోచనలో పడేసింది వారిని.
అయితే కెప్టెన్సీ మార్పు విషయంలో ఆ జట్టు యాజమాన్యానికి రన్ మెషిన్ విరాట్(Virat) కనిపించాడు. డుప్లెసిస్ లేని సమయంలో జట్టు సారధ్య బాధ్యతలను భుజాన వేసుకున్న కోహ్లీ దానిని సమర్ధవంతంగా నిర్వర్తించాడు.
ఆసమయంలో కోహ్లీ కెప్టెన్సీ తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అయితే కోహ్లీ ఐపీఎల్ లో జట్టుకి సారధ్యం వహించడం ఇది కొత్తేమి కాదు, అతడు భారత క్రికెట్ టీమ్ కి కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటూనే,
ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు కూడా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. కాకపొతే రెండింటిని సమర్ధవంతంగా నిర్వహించడం అనేది తనను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని భావించిన కోహ్లీ, ఐపీఎల్ కెప్టెన్సీకి టాటా చెప్పేశాడు.
కోహ్లీ సారధ్యంలో : In Kohli Captaincy
ప్రస్తుతం కోహ్లీ ఇండియన్ సిక్రికేట్ టీమ్ కి(Indian Cricket Team) టెస్టుల్లో(Test) కానీ, వన్డే(One Day)ల్లో కానీ, టి20(T 2) ల్లో కానీ ఎందులోనూ కెప్టెన్ గా లేడు,
దాంతో ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ పేరు మారే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు
క్రికెట్ విశ్లేషకులు. పైగా కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఆర్.సి.బి రెండుపర్యాయాలు ప్లే ఆప్స్ కి వెళ్లగా ఒక పర్యాయం ఫైనల్ వరకు వెళ్లింది.
దీంతో ఈ సారిగనుక విరాట్ చేతిలో కెప్టెన్సీ బాధ్యతలు పెడితే ఖచ్చితంగా కప్పు కొట్టడం ఖాయమనే భావన యాజమాన్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
పూర్తి జట్టు ఇదే : Complete Team Of RCB
ప్రస్తుతానికి ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు:
- ఫాఫ్ డు ప్లెసిస్
- గ్లెన్ మాక్స్‌వెల్
- విరాట్ కోహ్లి
- రజత్ పటీదార్
- అనుజ్ రావత్
- సుయాష్ ప్రభుదేశాయ్
- దినేష్ కార్తీక్
- విల్ జాక్స్
- మనోజ్ భాండాగే
- మహిపాల్ లొమ్రోర్
- కర్ణ్ శర్మ
- ఆకాశ్ దీప్
- మయాంక్ దాగర్
- మహ్మద్ సిరాజ్
- విజయ్‌కుమార్ వైషాక్
- రాజన్ కుమార్
- మోహమ్ దీప్
- రీస్ టోప్లీ
- హిమాన్షు శర్మ
- కామెరాన్ గ్రీన్
- టామ్ కరణ్
- అల్జారీ జోసెఫ్
- యష్ దయాల్
- స్వప్నిల్ సింగ్
- లక్కీ ఫెర్గూసన్
- సౌరవ్ చౌహాన్.