Common Man Victory: ఒక సామాన్యుడి విజయం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది.

A common man's victory.. won democracy.

ఒక సామాన్యుడి విజయం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించింద.

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
90 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రం లో 54 చోట్ల విజయం సాధించిన భాజపా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే..

ఇక్కడ సంచలనంగా మారిన విషయం ఏమిటంటే… కళ్ళముందే కన్న కొడుకు
హత్యను చూసిన ఆ గుండె మండిపోయింది. దేనితో

కడుపు మండిన ఒక సామాన్య దినసరి కూలీ చత్తీస్ ఘడ్ ఎన్నికల బరిలోకి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్ గఢ్ లో పెను సంచలనం సృష్టించింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలీ. సాహు పనికి వెళ్తేనే వాళ్లింట్లో పూట గడిచేది. అతని కుమారుడు ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అల్లర్లలో మరణించాడు.

ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్‌పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందడాన్ని ఈశ్వర్‌ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ కూడా ఆరోపించింది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్‌ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది.

ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా బరిలోకి దిగారు.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్‌ సాహు 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. తన గెలుపు గురించి మీడియా ముందు మాట్లాడుతూ అసత్యంపై సత్యం గెలిచిందని, తన విజయానికి సహకరించిన వారిందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అడుగడుగునా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Leave a Comment