మేడారం జాతర హుండీ లో ఒక భక్తురాలి వింత కోరిక

00f436f0 6a33 43bf b435 d37f84c75271 మేడారం జాతర హుండీ లో ఒక భక్తురాలి వింత కోరిక

ఇటీవల మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసింది. ఈ సారి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇప్పుడు అధికారులు అక్కడ హుండీ లను లెక్కించే పని పడ్డారు. ఈసారి హుండీ ఆదాయం కూడా బాగానే పెరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన 112 హుండీ లను లెక్కించగా దాదాపు 9.60 కోట్లు ఆదాయం సమకురినట్లు అధికారులు చెప్పారు. ఎవరైనా జాతరకు వచ్చి నపుడు హుండీ లలో నగదు తో పాటు కొంత కానుకల రూపేణ వారి శక్తీ కొలది బంగారం లేదా వెండి కానుకలు వెయ్యడం మన అందరికి తెలిసిందే.

అయితే ఈ సారి కాస్త వెరైటీ గా ఆలోచించారు భక్తులు ఎలా అంటే మా పిల్లకు IIT సీటు రావాలని, మా పిలకు మంచి సంబందం రావలి అని మొక్కుతూ చీటీలను హుండీ లో వేసారు. హుండీలను లెక్కిస్తున్నా అధికారులు ఈ చీటీ లను చూసి అవాక్కు అయ్యారు. ఇప్పుడు ఈ చీటీ తాలుకు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Comment