బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు

website 6tvnews template 2024 03 01T152318.252 బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు

A huge explosion in the famous Madras Rameswaram Cafe in Bangalore : బెంగలూరు లో నడిబొడ్డున ఒక ప్రముఖ కేఫ్ అయిన మద్రాస్ రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో 5 గురు గాయపడ్డారు.

గాయపడిన వారిలో 3 కేఫ్ స్టాఫ్ అని తెలుస్తోంది. ఈరోజు మద్యాహ్నం 1.00 కు భారీ శబ్దం తో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. అక్కడే ఉన్న కస్టమర్ ల తో పాటు ప్రజలు పరుగులు పెట్టారు. ఈ భారీ పేలుడు తో బెంగళూరు నగరం ఒక్కసారి ఉలిక్కి పడింది.

దీనికి సంబదించిన ఎంక్వయిరీ చేస్తున్నామని, అంత తనిఖీలు చేస్తున్నామని నగర పోలీస్ కమీషనర్ ఒక ప్రకటన విడుదల చేసారు. మద్రాస్ రామేశ్వరం కేఫ్ అనేది బెంగలూరు లో ప్రసిద్ధి చెందిన ఒక ఫుడ్ కోర్టు.

చూడడానికి చిన్న కొట్టు – నెలకి బిజినెస్ 4 కోట్లు పైనే

మనం కష్ట పడాలే కాని అది ఎటువంటి బిజినెస్ అయిన సరే డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఈ రోజుల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ తక్కువ , మంచి ఇన్కమ్, 24 గంటలు పనిచేస్తా, తిండి గురించి కూడా పట్టించుకోను అనుకుంటే, అలాంటి వారికి పనికొచ్చే బిజినెస్ ఐడియా కావాలా అంటే టక్కున గుర్తు వచ్చే బిజినెస్, హోటల్ బిజినెస్.మీరు ఎప్పుడైనా బెంగలూరు వెళ్ళారా, ఒక వేల వెళ్ళితే మాత్రం అక్కడ ఇందిరా నగర్ లో ఉన్న మద్రాస్ రామేశ్వరం కేఫ్ కి ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే ఫుడ్ లవర్స్ అందరు బాగా ఇష్ట పడతారు.చూడడానికి చిన్న కిరాణా కొట్టు లా ఉన్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్ పేరు తో మంచి పేరు సంపాదించింది. దీనికి నెలకి 4.5 కోట్లు వ్యాపారం జరుగుతుంది అంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం. ఇంతకి ఈ కేఫ్ ఎవరిదో తెలుసుకుందా రండి !

రాగవేంద్ర రావు ఈయనకు 20 సంవత్సరాలు పైగా ఫుడ్ బిజినెస్ లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన భార్య పేరు దివ్య, చార్టర్డ్ అకౌంటెంట్. వీళ్ళు ఇద్దరు కల్సి ఈ కేఫ్ ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ కేఫ్ కి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కాకుండా, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షిస్తోంది.వీరికి అబ్డుల్ కలాం అంటే ఎంతో ఇష్టం, వీరాభిమానం, ఆయన కలలు కనండి, ఆ కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగా కష్టపడండి అని చెప్పే వారి మాటలు దృష్టి లో పెట్టుకుని వారు జన్మించిన ప్రాతం పీరు మీదనే మొదట మద్రాస్ రామేశ్వరం కేఫ్ అని స్దాపించాం అని తర్వాత దిన దినాభి వృద్ధి చెందుతూ ” ది రామేశ్వరం కేఫ్ ” గా పేరు మారి ఇప్పుడు మరింత అభిమానులను సంపాదించామని ఈ దంపతులు చెప్పారు. ఇప్పుడు బెంగలూరు నగరం లో 2 కేఫ్ లను 2021 లో ప్రారంభించినట్లు వారు చెప్పారు
‘రామేశ్వరం కేఫ్ ” రోజుకు 7,500 మందికి సర్వ్‌ చేస్తుంటారు. నెలకు రూ.4.5 కోట్ల బిజినెస్ ఉంటుందని చెప్పారు , అయితే సంవత్సరానికి రూ. 50 కోట్ల వ్యాపారం చేస్తున్నాం అని చెప్పారు. దాదాపు 70 శాతం గ్రాస్‌ మార్జిన్‌ ఉంటుందని ఆయన చెప్పారు.

మా ఇద్దరి లక్ష్యం :

త్వరలో మా రామేశ్వరం కేఫ్ సౌత్ ఇండియా లో లభించే అన్ని రుచులను ఇప్పుడు దేశం అంతా విస్తరించాలని అనేది మా లాక్ష్యం గ పెట్టుకున్నాం అని చెప్పారు. రాబోయే రోజుల్లో బెంగలూరు తో పాటు చెన్నై, హైదరాబాద్,ఢీల్లీ,పూణే,అహ్మదాబాద్,ముంబై వంటి ప్రముఖ నగరాలలో శాఖలు ప్రరంభిచాలని లక్ష్యం గా పెట్టుకున్నాం అని చెప్పారు.

మా కేఫ్ లో లభించే ఐటమ్స్ :

ఇడ్లీ,బటర్‌ ఇడ్లీ,నెయ్యి సాంబార్‌ ఇడ్లీ,లెమన్‌ ఇడ్లీ,మిని వడ,నెయ్యి వడ,వెన్‌ పొంగల్‌,సక్కరై పొంగల్‌ ( చెక్కర పొంగళి), పాటు ఇంకా చాల వెరైటీ ఆహార పదార్ధాలను కూడా టేస్ట్‌ చెయ్యవచ్చు.

Leave a Comment