ప్రతి ఒక్కరికి జీడిపప్పు అంటే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. మన భారతీయులు ప్రతీ వంటకం లో దాదాపు జీడిపప్పు వాడటం చూస్తూ ఉంటాం. నెలకి నిత్యావసర సరుకులతో పాటు శక్తి ఉన్నవాళ్ళు బాగానే కొంటారు, మరి సామాన్యుల, బీదల పరిస్థితి ఏంటి ? ఇప్పుడు జీడిపప్పు kg 650 నుండి 900 వరకు పలుకుతోంది. సరే ఇది అంతా ఎందుకు kg జీడిపప్పు 30 రూపాయలు కి ఎక్కడ అను అడుగుతారా, ఆ విషయానికి వస్తున్న…
మరి ఎక్కడో కాదండి మన దేశం లోనే జార్ఖండ్ రాష్ట్రం లో జంతారా అనే ఊరు లో kg 30 రూపాయలకే దొరుకుతుంది. ఆ గ్రామం లోకి వెళ్తే రోడ్డు కి ఇరువైపులా గుట్టలు గుట్టలు పోసి అమ్ముతారు. అలా అని నాణ్యత లేనివి అనుకోకండి అక్కడ దొరికేవి చాలా మంచివె. కాకబొతే అక్కడ పండించిన రైతు లు సిటీ కి తీసుకువచ్చి అమ్మే పరిస్థితి లేదు, అందుకనే అక్కడకక్కడే అమ్మేస్తూ ఉంటారు.
ఇంకా బేరమాడితే 20 రూపాయలకు కూడా ఇచ్చేస్తారు. అక్కడ అంతలా పండడానికి కారణం అక్కడి వాతావరణంతో పాటు మంచి నేల అవ్వడం తో దిగుబడి విపరీతంగా ఉంటుంది. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ లు లేకపోవడం వల్ల రైతులు ఇలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.